Nissan Magnite: నిస్సాన్ మాగ్నైట్ కారు కొనాలనుకునే వారికి షాక్

New Nissan Magnite SUV Prices Hiked by Rs 22000 Across all Variants
x

Nissan Magnite: నిస్సాన్ మాగ్నైట్ కారు కొనాలనుకునే వారికి షాక్

Highlights

Nissan Magnite: నిస్సాన్ మోటార్ ఇండియా నమ్మకమైన కార్ల తయారీ సంస్థ. కంపెనీకి చెందిన 'మాగ్నైట్' దేశంలో ఫేమస్ ఎస్‌యూవీ.

Nissan Magnite: నిస్సాన్ మోటార్ ఇండియా నమ్మకమైన కార్ల తయారీ సంస్థ. కంపెనీకి చెందిన 'మాగ్నైట్' దేశంలో ఫేమస్ ఎస్‌యూవీ. ఈ కారు డిజైన్, ఫీచర్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ కారు సేల్స్ కూడా భారీగానే ఉన్నాయి. తాజాగా నిస్సాన్ మోటార్ సరికొత్త మాగ్నైట్ ధరలను పెంచింది. మాగ్నైట్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ విసియా, విసియా ప్లస్, అసెంటా, ఎన్-కనెక్టాతో సహా పలు రకాల వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అన్ని వేరియంట్స్‌లోనూ రూ.22,000 వరకు ధర పెరిగింది. మాగ్నైట్ ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.5.99 లక్షల నుండి రూ.6.12 లక్షలకు పెరిగింది.

కొత్త నిస్సాన్ మాగ్నైట్ స్టైలిష్‌గా ఉంటుంది. చక్కని హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్ఎల్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, 16-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ ఉన్నాయి. కాపర్ ఆరెంజ్, ఫ్లేర్ గార్నెట్ రెడ్, బ్లేడ్ సిల్వర్‌తో సహా వివిధ కలర్స్‌లో ఈ కారు అందుబాటులో ఉంది. ఈ కారులో ప్రయాణీకులు సౌకర్యవంతంగా కూర్చోడానికి విశాలమైన 5-సీట్లు ఉన్నాయి. ఎక్కువ లగేజీని తీసుకెళ్లేందుకు 336 లీటర్ల కెపాసిటీ బూట్ స్పేస్ వచ్చింది.

ఈ ఎస్‌యూవీ రెండు పవర్‌ట్రెయిన్‌లతో అందుబాటులో ఉంది. మొదటిది 1-లీటర్ నాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కాగా, రెండోది 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. వేరియంట్లలో 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్, CVT గేర్‌బాక్స్‌ ఆప్షన్లు ఉన్నాయి. మాగ్నైట్ ఎస్‌యూవీ లీటర్‌కు 17 నుండి 20 కెఎమ్‌పిల్ మైలేజీని ఇస్తుంది.

కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఫీచర్ల గురించి చెప్పాలంటే.. కారుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 4-కలర్ యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి.

భద్రత పరంగా ప్రయాణీకుల రక్షణ కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, ఆటో డిమ్మింగ్ ఇంటీరియర్ రేర్ వ్యూ మిర్రర్, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు చూడొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories