MG Windsor EV: టాటా నెక్సాన్‌కు కొత్త చిక్కులు.. దుమ్ములేపుతున్న ఎంజీ విండ్‌సర్ ఈవీ

MG Windsor EV
x

MG Windsor EV: టాటా నెక్సాన్‌కు కొత్త చిక్కులు.. దుమ్ములేపుతున్న ఎంజీ విండ్‌సర్ ఈవీ

Highlights

MG Windsor EV: ఆటో కంపెనీల సేల్స్ డేటా చూస్తే భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) డిమాండ్ వేగంగా పెరుగుతుందని తెలుస్తోంది. ఎంజీ మోటార్ (MG Motor) పోర్ట్‌ఫోలియోలో ఒక సూపర్ కారు ఉంది.

MG Windsor EV: ఆటో కంపెనీల సేల్స్ డేటా చూస్తే భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) డిమాండ్ వేగంగా పెరుగుతుందని తెలుస్తోంది. ఎంజీ మోటార్ (MG Motor) పోర్ట్‌ఫోలియోలో ఒక సూపర్ కారు ఉంది. దాన్ని 'క్లాస్ టాపర్' అని చెప్పొచ్చు. విండ్‌సర్ ఈవీ (Windsor EV) మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఈ కారు కంపెనీ ఈవీ అమ్మకాలను పెంచుతోంది. అందుకే ఈ కారు కంపెనీకి చాలా లక్కీగా మారింది అని చెప్పడంలో సందేహం లేదు.

ఎంజీ సేల్స్ దూకుడు

గత నెలలో ఎంజీ మోటార్ మొత్తం 6,304 కార్లను విక్రయించింది. ఏడాది వారీగా చూస్తే కంపెనీ అమ్మకాల్లో 39.78 శాతం వృద్ధి నమోదైంది. విండ్‌సర్ ఈవీ లాంచ్ అయిన తర్వాత నుంచి కంపెనీ అమ్మకాలు వేగంగా పెరిగాయి. ఈ విజయానికి ప్రధాన కారణం ఎంజీ విండ్‌సర్, దాని PRO వేరియంట్‌లకు వచ్చిన అద్భుతమైన స్పందన.

3 లక్షల మంది కొనుగోలు

ఎంజీ మోటార్ ఈ ఎలక్ట్రిక్ కారుకు ఉన్న క్రేజ్ ఎంతలా ఉందంటూ.. ఇటీవల కంపెనీ ప్రో (Pro) వేరియంట్‌లను – ఎసెన్స్ ప్రో (Essence Pro), ఎక్స్‌క్లూజివ్ ప్రో (Exclusive Pro) పేర్లతో – మార్కెట్లోకి విడుదల చేసింది. డ్రైవింగ్ రేంజ్ విషయానికి వస్తే.. ఈ కారు ఒకే ఛార్జింగ్‌తో 449 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. ఇందులో లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), అలాగే వెహికల్-టు-వెహికల్ (V2V), వెహికల్-టు-లోడ్ (V2L) ఛార్జింగ్ సపోర్ట్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఎంజీ విండ్‌సర్ ఈవీ ధర ఎంతంటే?

ఎంజీ మోటార్ ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 9 లక్షల 99 వేల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఈ ధరలో మీకు BaaS (Battery as a Service) ప్రోగ్రామ్‌తో పాటు కారు లభిస్తుంది. మీరు BaaS ప్రోగ్రామ్‌తో ఈ కారును కొనుగోలు చేస్తే ప్రతి కిలోమీటర్‌కు రూ. 3.9 ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే, మీరు బ్యాటరీని అద్దెకు తీసుకున్నట్లు అన్నమాట.

నెక్సాన్ ఈవీతో గట్టి పోటీ

ఎంజీ మోటార్ ఈ పాపులర్ ఎలక్ట్రిక్ కారు టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ (Nexon EV)తో పోటీ పడుతోంది. టాటా నెక్సాన్ ఈవీ ధర రూ. 12. 49లక్షలు (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ అధికారిక సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, నెక్సాన్ ఈవీ పూర్తి ఛార్జింగ్‌తో 489 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వచ్చే టాటా ఈ ఎలక్ట్రిక్ కారు 8.9 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories