MG Comet EV Discount: ఇంత తగ్గింపు ఎప్పుడు చూడలేదు.. ఈ బుడ్డి ఎలక్ట్రిక్ కారుపై భారీ డిస్కౌంట్..!

MG Comet EV Discount
x

MG Comet EV Discount: ఇంత తగ్గింపు ఎప్పుడు చూడలేదు.. ఈ బుడ్డి ఎలక్ట్రిక్ కారుపై భారీ డిస్కౌంట్..!

Highlights

MG Comet EV Discount: కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటర్స్ తన దూకుడును మరింత పెంచింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కార్లను విక్రయిస్తూ టాప్ కంపెనీలకు గట్టి సవాల్ విసురుతుంది.

MG Comet EV Discount: కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటర్స్ తన దూకుడును మరింత పెంచింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కార్లను విక్రయిస్తూ టాప్ కంపెనీలకు గట్టి సవాల్ విసురుతుంది. ముఖ్యంగా సాంప్రదాయ ఇంధన కార్లను మార్కెట్లోకి తీసుకొస్తూనే ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌పైదృష్టి సారించింది. చౌకగా ఎలక్ట్రిక్ కార్లను విక్రయించే సంస్థగా అవతరించింది.

ఇప్పుడు ఎంజీ మోటార్స్ తన కామెట్ EVపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ఎంజీ కామెట్ ఈవీ అన్ని మోడళ్లపై అందుబాటులో ఉంటుంది. మీరు కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇది మీకు చాలా మంచి అవకాశం. మార్చి నెలలో ఈ కారును కొనుగోలు చేయడం ద్వారా రూ. 45 వేల వరకు ప్రయోజనాలు లభిస్తాయి.

MG Comet EV Features

కంపెనీ కస్టమర్ల కోసం నాలుగు వేర్వేరు వేరియంట్లలో MG కామెట్ EVని విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్, ఎక్స్‌క్లూజివ్, 100-ఇయర్ ఎడిషన్ కోసం ఎంపికలు ఉన్నాయి. ఇది కాంపాక్ట్ కారు, దీని పొడవు 2974 మిమీ, వెడల్పు 1505 మిమీ, ఎత్తు 1640 మిమీ. ఈ కారులో మీరు 17.3కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంది. ఈ కారులో మోటార్ 42 పిఎస్ పవర్, 110 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ఈ కారులో 3.3 కిలోవాట్ ఛార్జర్‌ను అందించింది. 5 గంటల్లో కారును 80 శాతం వరకు ఛార్జ్ చేయచ్చు.

MG Comet EV Black Smart Edition

ఎంజీ కామెట్ ఈవీ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌లో ఎటువంటి మెకానికల్ మార్పులు చేయలేదు. కానీ ఇందులో 17.3కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ కారులోని ఎలక్ట్రిక్ మోటార్ 42 హెచ్‌పి పవర్, 110 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు MIDC పరిధి 230 కిలోమీటర్లు. బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌తో విడుదల చేసిన కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ కారు ఇది. 10.25-అంగుళాల స్క్రీన్‌, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం రెండు ఎయిర్‌బ్యాగ్స్ కూడా అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories