MG Majestor Launched: టయోటా ఫార్చ్యూనర్‌కు బిగ్ షాక్.. పోటీగా భారీ ఎస్‌యూవీ.. లాంచ్ ఎప్పుడంటే..?

MG Motor India is Preparing to Launch Majestor SUV May 2025 Price is Expected to be Around 40 Lakh
x

MG Majestor Launched: టయోటా ఫార్చ్యూనర్‌కు బిగ్ షాక్.. పోటీగా భారీ ఎస్‌యూవీ.. లాంచ్ ఎప్పుడంటే..?

Highlights

MG Majestor Launched: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ త్వరలో భారతీయ ఎస్‌యూవీ విభాగంలో కొత్త మోడల్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

MG Majestor Launched: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ త్వరలో భారతీయ ఎస్‌యూవీ విభాగంలో కొత్త మోడల్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో ఈ ఎస్‌యూవీ మొదటిసారి కనిపించింది. ఎంజీ మెజెస్టర్ పేరుతో కంపెనీ దీన్ని విడుదల చేయనుంది. ఇప్పటికే టెస్టింగ్ సమయంలో ఈ ఎస్‌యూవీ చాలాసార్లు కనిపించింది. ఇది పవర్ ఫుల్ ఎస్‌యూవీగా వస్తుంది. ఈ కారు భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నారు. ఈ కొత్త మోడల్ లాంచ్ గురించి జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ నుండి ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు.

మీడియా నివేదికల ప్రకారం.. కొత్త మెజెస్టర్ విడుదలకు ముందు రోడ్లపై కనిపించింది. కానీ ఈ కారు కవర్ చేయలేదు. ఇందులో దాని ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను చూడచ్చు. ఇది చాలా బోల్డ్, స్పోర్టీ డిజైన్‌లో కనిపిస్తుంది. ఈ ఎస్‌యూవీని పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో తీసుకురావచ్చు. దీని పెట్రోల్ ఇంజన్ 184kw పవర్, 410Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా, 160kw పవర్, 500Nm టార్క్ అందించే టర్బో డీజిల్ ఇంజన్‌ను కూడా ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో 4X4 డ్రైవ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 190 కిమీ. దీనికి 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించే అవకాశం ఉంది.

MG Majestor Specifications

కొత్త మెజెస్టర్‌లో అనేక గొప్ప ఫీచర్లను అందించవచ్చు. దీనిలో 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను చూడవచ్చు. ఇది కాకుండా, ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్, ముందు భాగంలో పెద్ద గ్రిల్, 20 అంగుళాల అల్లాయ్ వీల్స్, టైప్ C USB ఛార్జింగ్ పోర్ట్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ పోర్ట్, డ్రైవింగ్ కోసం అనేక మోడ్‌లు వంటి అనేక ఫీచర్లను ఇందులో అందించవచ్చు. దీనితో పాటు, భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, హిల్ అసిస్ట్, అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

MG Majestor Price

కొత్త మెజెస్టర్‌ను D+ SUV విభాగంలో ప్రారంభించవచ్చు. ఈ ఏడాది జూన్-జూలైలో ఈ SUVని విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 40 నుండి 50 లక్షల మధ్య ఉండవచ్చు. భారతదేశంలో, ఇది టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్‌తో పోటీ పడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories