MG Cyberster EV Booking: ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ వచ్చేస్తోంది.. బుకింగ్స్ కూడా ఓపెన్

MG Cyberster EV Booking: ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ వచ్చేస్తోంది.. బుకింగ్స్ కూడా ఓపెన్
x
Highlights

MG Cyberster EV Booking: ఎమ్‌జీ మోటర్స్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో అందరి ద‌ృష్టిని ఆకర్షించింది. కంపెనీ దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్...

MG Cyberster EV Booking: ఎమ్‌జీ మోటర్స్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో అందరి ద‌ృష్టిని ఆకర్షించింది. కంపెనీ దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ ఈవీని ఎమ్‌జీ సైబర్‌స్టర్‌ని ఆవిష్కరించింది. అయితే ఎమ్‌జీ తాజాగా ఈ కారు బుకింగ్స్‌ను ప్రారంభించింది. వినియోగదారులు ఎమ్‌జీ డీలర్‌షిప్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఎమ్‌జీ సైబర్‌స్టర్ డిజైన్ దాని అతిపెద్ద ప్లస్ పాయింట్. ఈ కారు ఫీచర్లు, రేంజ్ తదితర వివరాలు తెలుసుకుందాం.

ఎమ్‌జీ సైబర్‌స్టర్ రెండు-సీట్ల కారు. కారులో రెండు మోటార్‌లు ఉంటాయి. ఈ కారు 548 బిహెచ్‌పి పవర్, 725 ఎన్ఎమ్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ కారు 3.2 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకోగలదు. MG సైబర్‌స్టర్‌లో 77 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. ఈ స్పోర్ట్స్ ఈవీని ఫుల్ ఛార్జ్ చేస్తే 570 కిమీల వరకు ప్రయాణించవచ్చు.

ఎమ్‌జీ సైబర్‌స్టర్ గ్లోబల్ వేరియంట్ గురించి మాట్లాడితే, ఈవీలో 64కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీని ఉంది. ఈ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే 519 కిమీ రేంజ్ ఇస్తుంది. ఇందులో అమర్చిన మోటార్ 296 బిహెచ్‌పి పవర్ రిలీజ్ చేస్తుంది.

ఫీచర్ల విషయానికి వస్తే.. కొత్త సైబర్‌స్టర్ ఈవీ‌లో అధునాతన ట్రిపుల్ డిజిటల్ స్క్రీన్‌ ఉంది. ఈ కారులో 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్‌తో అదనపు స్క్రీన్ ఉన్నాయి. ఈ స్క్రీన్ ద్వారా మీరు ఏసీని కంట్రోల్ చేయచ్చు. కారులో మల్టీ-స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్‌ ఉంది. వీల్‌తో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆడియో సిస్టమ్ రెండింటినీ కంట్రోల్ చేయచ్చు.

సేఫ్టీ గురించి మాట్లాడితే.. ఎమ్‌జీ సైబర్‌స్టర్ ఈవీలో ఫోల్డబుల్ రూఫ్, మెమరీ ఫంక్షన్, 6 వైపులా ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ హీటెడ్ సీట్, 8 స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్ ఉన్నాయి. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్‌బ్యాగ్‌లు, 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ కూడా అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories