MG Comet: భారత్‌లో ఎంజీ కామెట్‌ ఈవీ ప్రారంభం.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 230 కీమీ రయ్‌రయ్‌, దీని ధర ఎంతో తెలుసా?

MG Comet 2025 Launched in India Price Features and Everything You Need to Know About the New EV
x

MG Comet: భారత్‌లో ఎంజీ కామెట్‌ ఈవీ ప్రారంభం.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 230 కీమీ రయ్‌రయ్‌, దీని ధర ఎంతో తెలుసా?

Highlights

MG Comet 2025 Launched: ఈవీ వెహికల్స్‌ కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్‌న్యూస్‌. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా 2025 కోమెట్‌ ఈవీ కారును మనం దేశంలో ప్రారంభించింది. దీని మార్కెట్‌ ధర ఇతర వివరాలు తెలుసుకుందాం.

MG Comet 2025 Launched: ఈవీ వెహికల్స్‌ కొనడానికి ఎదురు చూస్తున్నారా? రూ.5 లక్షల లోపు కొనుగోలు చేయాలని ఎదురు చూస్తున్నవారికి గుడ్‌న్యూస్‌. ఎంజీ కామెట్‌ 2025 ఈవీ విడుదలైంది. దీని మార్కెట్‌ (ఎక్స్‌ షోరూమ్‌) ధర రూ.4.99 లక్షు మాత్రమే.ఇందులో బ్యాటరీ సర్వీస్‌ (BaaS) సదుపాయం కూడా ఉంది. కిలోమీటర్‌కు రూ.2.5 మాత్రమే. పెరుగుతున్న పెట్రోల, డీజిల్‌ ధరల నేపథ్యంలో ఎక్కువ శాతం మంది ఈవీలకు మొగ్గుచూపుతున్నారు. వ్యక్తిగత అవసరాలకు ప్రధానంగా ఆఫీసుకు వెళ్లి రావడానికి ఇలాంటి చిన్న సైజు కారులు సరిపోతాయి. అయితే, ఈ కొత్త వెర్షన్‌ ఫీచర్‌లో కొన్ని మార్పులు చేశారు. భద్రత, కంఫర్ట్‌గా ఉండటానికి ఈ మార్పులు చేసింది.

2025 ఎంజీ కామెట్‌ 5 ట్రిమ్‌ లెవల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎగ్జిక్యూటీవ్‌, ఎగ్జైట్‌, ఎగ్జైట ఫాస్ట్‌ ఛార్జ్‌, ఎగ్జైట్‌ ఎఫ్‌సీ వేరియంట్‌ కార్లు రేర్‌ పార్కింగ్‌ కెమెరాలు కూడా ప్రత్యేకంగా కలిగి ఉంటున్నాయి. దీంతోపాటు పవర్‌ ఫోల్డింగ్‌ ఓఆర్‌ఎంఎస్‌ ఉంటుంది. ప్రత్యేకంగా కారు సీట్లను లెదర్‌తో తయారు చేశారు. అంతేకాదు 4 స్పీకర్‌ ఆడియో సిస్టం కూడా ఉంది. కానీ, ఎఫ్‌సీ వెరియంట్లు 17.4 kWh బ్యాటరీతో ఒక్కసారి ఛార్జీ చేస్తే 230 కిలో మీటర్లు రయ్‌ రయ్‌మంటూ దూసుకెళ్లవచ్చు.

ఎంజీ కామెట్‌ ఫీచర్లు ఇవే..

ఇక ఎయిర్‌బ్యాగ్స్‌ విషయానికి వస్తే ఎంజీ కామెట్‌ ఈవీలో డ్యూయల్‌ ఫ్రంట్‌ ఎయిర్‌ బ్యాగ్స్‌, సెన్సర్‌ పార్కింగ్‌, స్పీడ్‌ సెన్సింగ్‌, ఆటో డోర్‌ లాక్‌, ఏబీఎస్‌ ఈబీడీ, రివర్స్‌ పార్కింగ్‌ కెమెరా, ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌, టైర్‌ ప్రెజర్‌ మానిటరిగ్‌ సిస్టం, ఫాలో మీ హోమ్‌ హెడ్‌ల్యాంప్స్‌, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌తోపాటు మరిన్ని ఫీచర్స్‌ పొందుపరిచారు.

ఎంజీ మోటర్స్‌ కామెట్‌ భారత్‌లో 2025 ఫిబ్రవరిలో కామెట్‌ బ్లాక్‌స్టార్మ్‌ ఎడిషన్‌ ద్వారా ఎలక్ట్రానిక్‌ వెహికల్‌ రేంజ్‌ను విస్తరిస్తోంది. దీని ధర రూ.7.80 (ఎక్స్‌ షోరూమ్) లక్షలు. ఎంజీ కామెట్‌ బ్లాక్‌ స్టార్మ్‌ ఎడిషన్‌ ఇతర మోడల్స్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. హెక్టార, ఆస్టర్‌ వంటివి అన్నీ కూడా బ్లాక్‌ పెయింట్‌ స్కీమ్‌, రెడ్‌ యాక్సెంట్స్‌తో అందుబాటులో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories