Maruti Suzuki Grand Vitara: పడిపోతున్న గ్రాండ్ విటారా సేల్స్.. ఫిబ్రవరిలో 10 వేల యూనిట్లే అమ్ముడయ్యాయి..!

Maruti Suzuki Grand Vitara sales drop Febrauary 2025
x

Maruti Suzuki Grand Vitara: పడిపోతున్న గ్రాండ్ విటారా సేల్స్.. ఫిబ్రవరిలో 10 వేల యూనిట్లే అమ్ముడయ్యాయి..!

Highlights

Maruti Suzuki Grand Vitara: మారుతి సుజుకి గ్రాండ్ విటారా‌కు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Maruti Suzuki Grand Vitara: మారుతి సుజుకి గ్రాండ్ విటారా‌కు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కారు డిజైన్, ఫీచర్ల కారణంగా సామాన్య ప్రజల నుండి సినిమా తారల వరకు ఇష్టపడుతున్నారు. ఇటీవలే అన్ని ఆటోమొబైల్ తయారీ కంపెనీలు తమ ఫిబ్రవరి నెల విక్రయాల నివేదికను వెల్లడించాయి. దేశీయ విపణిలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీల జాబితాలో 'గ్రాండ్ విటారా' కూడా ఏడో స్థానంలో ఉంది.

గత నెల ఫిబ్రవరి - 2025లో మారుతి సుజుకి దాదాపు 10,669 గ్రాండ్ విటారా ఎస్‌యూవీలను విక్రయించింది. 2024లో ఇదే నెలలో 11,002 యూనిట్లు విక్రయించింది. దానితో పోలిస్తే, అమ్మకాల పరిమాణం సంవత్సరానికి -3శాతం (YoY) వద్ద స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతానికి, అమ్మకాల గణాంకాలు తగ్గడానికి కంపెనీ ఎటువంటి కారణాన్ని వెల్లడించలేదు. ఇవన్నీ కలిపి ఒక్క జనవరిలోనే 15,784 యూనిట్ల గ్రాండ్ విటారా కార్లు విజయవంతంగా అమ్ముడయ్యాయి. 2024 ద్వితీయార్థంలో కూడా, ఈ ఎస్‌యూవీలు మంచి సంఖ్యలో అమ్ముడయ్యాయి. డిసెంబర్‌లో 7,093 యూనిట్లు, నవంబర్‌లో 10,148 యూనిట్లు, అక్టోబర్‌లో 14,083 యూనిట్లు, సెప్టెంబర్‌లో 10,267 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ప్రస్తుతం దేశీయంగా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న కొత్త మారుతి గ్రాండ్ విటారా ఎస్‌యూవీ ధర కనిష్టంగా రూ. 11.19 లక్షలు, గరిష్టంగా రూ. 20.09 లక్షల ఎక్స్-షోరూమ్. సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా వివిధ రకాల వేరియంట్స్‌లో ఉంది. నెక్సా బ్లూ, ఓపులెంట్ రెడ్, స్ప్లెండిడ్ సిల్వర్‌తో సహా అనేక రంగు ఎంపికలలో కూడా అందుబాటులో ఉన్నాయి. పవర్ ట్రెయిన్ విషయానికి వస్తే, 1.5-లీటర్ తెలికపాటి హైబ్రిడ్ (పెట్రోల్+ఎలక్ట్రిక్), 1.5-లీటర్ బలమైన హైబ్రిడ్ 1.5-లీటర్. ఇందులో CNG ఇంజన్ ఆప్షన్ ఉంది. 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, e-CVT గేర్‌బాక్స్ ఉన్నాయి. గ్రాండ్ విటారా‌ 19.38 నుండి 27.97 kmpl వరకు మైలేజీని అందించగలదు.

కొత్త మారుతి గ్రాండ్ విటారా 5 సీట్లు ఉన్నాయి. అదనంగా 373 ఎల్. బూట్ స్పేస్ ఉంది. ఇది టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (9-అంగుళాల), డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే (7-అంగుళాల), వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు హెడ్స్-అప్ డిస్ప్లే వంటి అనేక లక్షణాలను కలిగి ఉంది. ఈ కారులో ప్రయాణీకుల కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి. కొత్త గ్రాండ్ విటారా ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా, హోండా ఎలివేట్, కియా సెల్టోస్ ఎంజీ ఆస్టర్, టయోటా హైరైడర్‌లతో పోటీపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories