Maruti Suzuki Escudo: హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌కు గట్టి పోటీగా మారుతీ సుజుకీ కొత్త ఎస్‌యూవీ ‘ఎస్కుడో’

Maruti Suzuki Escudo: హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌కు గట్టి పోటీగా మారుతీ సుజుకీ కొత్త ఎస్‌యూవీ ‘ఎస్కుడో’
x

Maruti Suzuki Escudo: హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌కు గట్టి పోటీగా మారుతీ సుజుకీ కొత్త ఎస్‌యూవీ ‘ఎస్కుడో’

Highlights

తాజాగా మారుతీ సుజుకీ నుంచి మరో కొత్త ఎస్‌యూవీ మార్కెట్లోకి రానుందని సమాచారం. ప్రముఖ మోడల్స్ అయిన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌లకు పోటీగా ఈ కొత్త మోడల్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఎస్‌యూవీకి ‘మారుతీ సుజుకీ ఎస్కుడో’ అనే పేరు పెట్టనున్నారు.

Maruti Suzuki Escudo: హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి పాపులర్ ఎస్‌యూవీలకు గట్టి పోటీగా మారుతీ సుజుకీ నుంచి ఒక కొత్త కాంపాక్ట్ SUV మార్కెట్లోకి రానుంది. ఈ కొత్త మోడల్‌కు ‘మారుతీ సుజుకీ ఎస్కుడో’ అనే పేరు నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే ‘ఎస్కుడో’ అనే పేరు భారత మార్కెట్లో ట్రేడ్‌మార్క్‌గా నమోదు చేయడం జరిగింది. అంతేకాదు, ఈ పేరు జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో సుజుకీ విటారా మోడల్‌కు ఇప్పటికే ఉపయోగిస్తున్నారు.

ఈ ఎస్‌యూవీను భారత వినియోగదారుల కోసం ప్రత్యేకంగా తయారు చేయనున్నట్లు సమాచారం. మారుతీ తన బ్రెజా, గ్రాండ్ విటారా లాంటి విజయవంతమైన SUVల మధ్య స్థాయిలో నిలిచేలా ఈ మోడల్‌ను ప్లాన్ చేస్తోంది. ఇందులో మారుతీ సుజుకీ గ్లోబల్ సీ ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మాణం జరిగే అవకాశముంది. అందుకే ఇది మరింత విశాలమైన క్యాబిన్ స్పేస్‌, పొడవైన వీల్‌బేస్ వంటి అంశాలతో రాబోతోందని అంచనా.

ఈ ఎస్‌యూవీ 2025 పండుగ సీజన్ నాటికి భారత మార్కెట్లోకి రానుందని అంచనా వేస్తున్నారు. ఒకసారి విడుదలైతే ఇది క్రెటా, సెల్టోస్, టైగన్, ఎలివేట్, కుషాక్, ఎంజీ ఆస్టర్ లాంటి మోడల్స్‌కి ప్రత్యర్థిగా మారనుంది. ఇది మారుతీ సుజుకీ అరేనా డీలర్ నెట్‌వర్క్ ద్వారా విక్రయానికి రానుంది.

ఇంటీరియర్ విషయానికొస్తే, ఎస్కుడో మోడల్ లో వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త డాష్‌బోర్డ్ డిజైన్ లాంటి ఆధునిక సౌకర్యాలు ఉండే అవకాశం ఉంది. టాప్ వేరియంట్‌లలో సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లను కూడా అందించే అవకాశం ఉంది.

ఇంజిన్ పరంగా చూస్తే, 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు మైల్డ్-హైబ్రిడ్ సాంకేతికతను ఇందులో వినియోగించనున్నారు. అలాగే డిమాండ్ పెరుగుతున్న CNG వేరియంట్‌ను కూడా అందించవచ్చని భావిస్తున్నారు. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

భద్రతా ఫీచర్ల విషయానికి వస్తే, మారుతీ సుజుకీ ఎస్కుడో అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ESC లాంటి ఫీచర్లను ప్రామాణికంగా అందించనుంది. టాప్ వేరియంట్‌లో 360 డిగ్రీ కెమెరా వంటి అధునాతన భద్రతా అంశాలు ఉండవచ్చని ఊహిస్తున్నారు.

ఈ కొత్త SUVకి సంబంధించిన మరిన్ని ఫీచర్లు, ధర, లాంచ్ తేదీ వంటి వివరాలు త్వరలో అధికారికంగా వెలువడే అవకాశముంది. మారుతీ నుంచి మరో హిట్ మోడల్‌గా ఎస్కుడో నిలవనుందా? అనేది చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories