Maruti Suzuki E Vitara: ఇంకా ఎన్నాళ్లు.. మారుతి తొలి ఎలక్ట్రిక్ వచ్చేస్తోంది.. 500 కిమీ రేంజ్‌తో టాప్ లేచిపోద్ది..!

Maruti Suzuki E Vitara
x

Maruti Suzuki E Vitara: ఇంకా ఎన్నాళ్లు.. మారుతి తొలి ఎలక్ట్రిక్ వచ్చేస్తోంది.. 500 కిమీ రేంజ్‌తో టాప్ లేచిపోద్ది..!

Highlights

Maruti Suzuki E Vitara: మారుతి భారత మార్కెట్లో అనేక విభాగాల్లో వాహనాలను విక్రయిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. కంపెనీ త్వరలో విడుదల చేయబోయే మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టెస్టింగ్ సమయంలో కనిపించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ఎత్తైన ప్రాంతంలో కంపెనీ దీన్ని పరిక్షిస్తోంది.

Maruti Suzuki E Vitara: మారుతి భారత మార్కెట్లో అనేక విభాగాల్లో వాహనాలను విక్రయిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. కంపెనీ త్వరలో విడుదల చేయబోయే మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టెస్టింగ్ సమయంలో కనిపించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ఎత్తైన ప్రాంతంలో కంపెనీ దీన్ని పరిక్షిస్తోంది. అయితే దీనికి సంబంధించి కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ కారు ధర, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.

Maruti Suzuki E Vitara Features

ఈ ఎస్‌యూవీలో కంపెనీ అనేక గొప్ప ఫీచర్లను అందించనుంది. ఇందులో త్రీ పాయింట్ మ్యాట్రిక్స్ రియర్ లైట్లు, యాంబియంట్ లైట్లు, 26.04 cm MID, షిఫ్ట్ బై వైర్‌తో కూడిన ట్విన్‌డెక్ ఫ్లోటింగ్ కన్సోల్, ఫిక్స్‌డ్ గ్లాస్‌తో సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, నెక్స్ట్ జెన్ సుజుకి కనెక్ట్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, 10వ పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, స్లైడింగ్, రిక్లైనింగ్ రియర్ సీట్లు, PM 2.5 క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్, ఫ్లెక్సిబుల్ బూట్ స్పేస్, లాంగ్ వీల్ బేస్, సెవెన్ ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి.

అలానే హై టెన్సిల్ స్టీల్ స్ట్రెంత్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, EPB, బ్రేక్ హోల్డ్, లెవెల్-2 అడాస్, టర్న్, డ్రైవింగ్ మోడెస్.2.5 8 అంగుళాల వీల్స్, రూఫ్ ,స్పాయిలర్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్, 25.65 సెంమీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హర్మాన్ ఆడియో సిస్టమ్, ఏబిఎస్, ఇబిడి, హిల్ అసిస్ట్ వంటి అనేక ఫీచర్లు అందించారు.

Maruti Suzuki E Vitara Battery

కంపెనీ E Vitaraలో 61 కిలోవాట్ సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తుంది. దీని కారణంగా ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని బ్యాటరీ 120 లిథియం అయాన్ ఆధారిత కణాలతో తయారు చేశారు. వీటిని చాలా తక్కువ ఉష్ణోగ్రతలు, చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలలో ఉపయోగించవచ్చు. కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఎస్‌యూవీ 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది.

Maruti Suzuki E Vitara Price

ఈ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 17 నుండి 20 లక్షల వరకు ఉండచ్చు. కానీ ఖచ్చితమైన ధర సమాచారం లాంచ్ సమయంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ విటారా లాంచ్‌కు సంబంధించి మారుతి నుండి ఇంకా అధికారిక సమాచారం ఇవ్వలేదు. కానీ కంపెనీ దీనిని పండుగ సీజన్‌లో ప్రారంభించవచ్చని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories