Maruti e Vitara launch: మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. బుకింగ్స్ షురూ..!

Maruti e Vitara launch
x

Maruti e Vitara launch: మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. బుకింగ్స్ షురూ..!

Highlights

Maruti Suzuki e Vitara: మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ SUV ఇ విటారాను ఆటో ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించింది.

Maruti e Vitara launch: మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ SUV ఇ విటారాను ఆటో ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించింది. ఇండస్ట్రీ వర్గాల సమచారం ప్రకారం.. ఇ-విటారా బుకింగ్ ప్రారంభమైంది. వినియోగదారులు రూ.25,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కానీ బుకింగ్ డీలర్‌షిప్ స్థాయిలో మాత్రమే జరుగుతోంది. అయితే దీని అధికారిక బుకింగ్‌లు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇ-విటారా మార్చిలో ప్రారంభించబడుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే కంపెనీ నుండి ఇంకా ఎటువంటి అప్‌డేట్ లేదు. సమాచారం ప్రకారం దీని అమ్మకాలు వచ్చే నెలలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ధర సుమారు రూ. 18 నుండి 20 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉండచ్చు.

మారుతి కొత్త ఇ విటారా కొత్త నాచురల్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై తయారుచేశారు. విటారాలో 49కిలోవాట్, 61కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంది. ఈ బ్యాటరీల రేంజ్ 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ. వినియోగదారులు తమ అవసరాన్ని బట్టి బ్యాటరీ ప్యాక్‌ని ఎంచుకోవచ్చు. ఇ వితారా గుజరాత్ ప్లాంట్‌లో తయారుచేశారు, అక్కడి నుండి జపాన్, యూరప్‌లకు ఎగుమతి అవుతుంది. అలానే నెక్సా అవుట్‌లెట్ల ద్వారా సేల్‌కి వస్తుంది.

కొత్త ఇ-విటారాలో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరాలు, లెవల్-2 అడాస్ వంటి భద్రతా ఫీచర్లు ఉంటాయి. వినియోగదారులు కారును నెక్సా బ్లూ, గ్రే, సిల్వర్, వైట్, రెడ్, బ్లాక్ సింగిల్-టోన్‌, బ్లూయిష్ బ్లాక్ రూఫ్‌తో పాటు స్ప్లెండిడ్ సిల్వర్, ఓపులెంట్ రెడ్, ఆర్కిటిక్ వైట్,ల్యాండ్ బ్రీజ్ గ్రీన్ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లలో కొనచ్చు. వెహికల్‌లో R18 ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్, పాలీహెడ్రల్ మస్కులర్ స్టాన్స్, 3D బోనెట్‌తో ఆకర్షణీయమైన ఫ్రంట్ ఫాసియా ఉంటుంది.

కొత్త ఇ-విటారా కొలతల గురించి చెప్పాలంటే.. పొడవు 4,275మిమీ, వెడల్పు 1,800మిమీ, ఎత్తు 1,635మిమీ, వీల్‌బేస్ 2,700మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 180మిమీ. అంతేకాకుండా ముందు భాగంలో యాక్టివ్ ఎయిర్ వెంట్‌లు, స్థిర పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. అలానే 3-పాయింట్ మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ డీఆర్ఎల్‌లు ఉన్నాయి. డ్రైవర్ సీటును 10 రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు.

కొత్త ఇ-విటారా ధరలు రూ. 17.99 లక్షల నుండి ప్రారంభమవుతాయి. ఈ కారు క్రెటా మాదిరిగా ఉంటుంది. కొత్త క్రెటా ఎలక్ట్రిక్ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌లో ఉంది. కారులో 51.4కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 472కిమీల రేంజ్ అందిస్తుంది. 42కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జింగ్‌పై 390కిమీల పరిధిని అందిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories