Maruti Suzuki e-Vitara Launch: షేర్ మార్కెట్‌లో దూసుకుపోయిన మారుతి సుజుకి.. ఆ ఒక్క ప్రకటనతో లాభాల పంట!

ఎలక్ట్రిక్ కార్లు అంటే భారీ ధరలు ఉంటాయని భయపడే వారికి మారుతి సుజుకి గుడ్ న్యూస్ చెప్పింది. 'బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్' (BaaS) అనే సరికొత్త ప్లాన్‌తో తన మొదటి ఎలక్ట్రిక్ వాహనం ఈ-విటారాను లాంచ్ చేసింది.

Ganesh
Published on: 17 Feb 2026 5:47 PM IST
Maruti Suzuki e-Vitara Launch: షేర్ మార్కెట్‌లో దూసుకుపోయిన మారుతి సుజుకి.. ఆ ఒక్క ప్రకటనతో లాభాల పంట!
X

Maruti Suzuki e-Vitara Launch: షేర్ మార్కెట్‌లో దూసుకుపోయిన మారుతి సుజుకి.. ఆ ఒక్క ప్రకటనతో లాభాల పంట!

ఎలక్ట్రిక్ కార్లు అంటే భారీ ధరలు ఉంటాయని భయపడే వారికి మారుతి సుజుకి గుడ్ న్యూస్ చెప్పింది. 'బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్' (BaaS) అనే సరికొత్త ప్లాన్‌తో తన మొదటి ఎలక్ట్రిక్ వాహనం ఈ-విటారాను లాంచ్ చేసింది. ఈ వార్తతో మంగళవారం షేర్ మార్కెట్‌లో మారుతి సుజుకి షేర్లు 1% పైగా లాభపడి, ఒక్కో షేరు రూ.15,211 వద్దకు చేరింది.

బ్యాటరీ అద్దె ప్లాన్ అంటే..

సాధారణంగా ఎలక్ట్రిక్ కారులో బ్యాటరీ ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మారుతి ఒక కొత్త ఆలోచన చేసింది. బ్యాటరీ ధర మినహాయించి, కారును కేవలం రూ.10.99 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. మీరు కారును ఎన్ని కిలోమీటర్లు నడిపితే, కిలోమీటరుకు రూ.3.99 చొప్పున బ్యాటరీకి అద్దె చెల్లిస్తే సరిపోతుంది. నిజానికి ఇది పెట్రోల్ ఖర్చు కంటే చాలా తక్కువ. ఈ కారును కొనుగోలు చేయాలనే వారికి రూ.50 వేలు విలువైన హోమ్ ఛార్జర్, ఇన్‌స్టాలేషన్ ఫ్రీగా ఇస్తున్నారు. అంతేకాకుండా, కారు కొన్న ఫస్ట్ ఈయర్ మొత్తం ఉచిత ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

కారు ప్రత్యేకతలు ఇవే..

ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 543 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ కారు బ్యాటరీపై 8 ఏళ్ల వారంటీ, కారుపై 3 ఏళ్ల వారంటీ ఉంటుంది (అదనపు ఫీజుతో దీన్ని 5 ఏళ్లకు పెంచుకోవచ్చు). ఇందులో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కారులో ADAS Level 2 టెక్నాలజీ అందుబాటులో ఉంది. ADAS Level 2 టెక్నాలజీ అంటే.. కారు దానంతట అదే వేగాన్ని కంట్రోల్ చేసుకోవడం వంటి స్మార్ట్ ఫీచర్లు. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే సాఫ్ట్‌వేర్, అత్యంత కఠినమైన ఉష్ణోగ్రతల్లో (-30°C నుంచి 60°C వరకు) పనిచేసే బ్యాటరీ దీని సొంతం. దీనిని కేవలం రూ.21 వేలు చెల్లించి నెక్సా (NEXA) షోరూమ్‌లలో లేదా వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. ఈ కార్లను మారుతి సుజుకి తన ప్లాంట్‌లోనే తయారు చేస్తోంది. ఇప్పటికే 28 దేశాలకు ఈ కార్ల ఎగుమతులు స్టార్ట్ అయ్యాయి.

Ganesh

Ganesh

2022లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 4 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. లైఫ్ స్టైల్, బిజినెస్‌, మూవీస్, స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా సినిమా గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story