Car Steering Right Way: చాలామంది కారు స్టీరింగ్‌ని తప్పుగా పట్టుకుంటారు.. ఈ తప్పు మీరు కూడా చేస్తున్నారా..!

Many People Are Holding The Steering Wheel Of The Car Wrongly Do You Also Do This Mistake
x

Car Steering Right Way: చాలామంది కారు స్టీరింగ్‌ని తప్పుగా పట్టుకుంటారు.. ఈ తప్పు మీరు కూడా చేస్తున్నారా..!

Highlights

Car Steering Right Way: ఇప్పటికీ చాలామంది కారు స్టీరింగ్‌ని సరిగ్గా పట్టుకోలేరు. తప్పుగా తిప్పుతూ ప్రమాదాలకు కారణమవుతారు.

Car Steering Right Way: ఇప్పటికీ చాలామంది కారు స్టీరింగ్‌ని సరిగ్గా పట్టుకోలేరు. తప్పుగా తిప్పుతూ ప్రమాదాలకు కారణమవుతారు. బహుశా.. వారికి సరైన పద్దతి తెలియకపోవచ్చు. కారు స్టీరింగ్ వీల్ ఒక గడియారం అనుకుంటే అందులో 9 గంటలు ఉన్న చోట ఎడమ చేతిని, 3 గంటలు ఉన్న చోట కుడి చేతిని పెట్టి స్టీరింగ్ వీల్ కంట్రోల్‌ చేయాలి. ఇలా పట్టుకోవడం సురక్షితమైనది దీనివల్ల మీరు స్టీరింగ్‌పై మెరుగైన నియంత్రణ కలిగి ఉంటారు.

ఈ స్థానం చాలా సురక్షితమైనది ఎందుకంటే ఈ స్థితిలో కారును వేగంగా, సులభంగా నడపడానికి అవకాశం ఉంటుంది. మీ మణికట్టు, చేతులపై ఎక్కువ భారం పడదు. స్టీరింగ్‌ని తప్పుగా పట్టుకోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మణికట్టు, చేతులపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. స్టీరింగ్‌ని ఏ విధంగా పట్టుకోకూడదో తెలుసుకుందాం.

ఒక చేత్తో స్టీరింగ్‌ని పట్టుకోవడం అస్సలు చేయకూడదు.

రెండు చేతులను 10, 2 గంటల స్థానంలో ఉంచకూడదు.

రెండు చేతులను 4, 8 గంటల స్థానంలో ఉంచడం మంచిది కాదు.

స్టీరింగ్ వీల్‌ను గట్టిగా పట్టుకోకూడదు.

స్టీరింగ్ వీల్‌ను చాలా వదులుగా పట్టుకోకూడదు.

కారు స్టీరింగ్‌ని పట్టుకునే పద్దతులు

ఎల్లప్పుడూ స్టీరింగ్ వీల్‌ని రెండు చేతులతో పట్టుకోవాలి.

రెండు చేతులను 9, 3 గంటల స్థానంలో ఉంచాలి.

స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకోవద్దు. అలాగని వదులుగా ఉంచవద్దు.

అనవసరంగా స్టీరింగ్‌ని పదే పదే తిప్పవద్దు.

మీరు రన్నింగ్‌లో వేగంగా తిరుగుతుంటే స్టీరింగ్ వీల్‌ని రెండు చేతులతో గట్టిగా పట్టుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories