Mahindra Scorpio N : కొత్త లుక్‌లో బిగ్ డాడీ..అదిరిపోయే ఫీచర్లతో రాబోతున్న మహీంద్రా స్కోర్పియో ఎన్

Mahindra Scorpio N : కొత్త లుక్‌లో బిగ్ డాడీ..అదిరిపోయే ఫీచర్లతో రాబోతున్న మహీంద్రా స్కోర్పియో ఎన్
x
Highlights

కొత్త లుక్‌లో బిగ్ డాడీ..అదిరిపోయే ఫీచర్లతో రాబోతున్న మహీంద్రా స్కోర్పియో ఎన్

Mahindra Scorpio N : మహీంద్రా నుంచి మరో భారీ బ్లాక్ బస్టర్ సిద్ధమవుతోంది. 2026 ప్రారంభంలో ఎక్స్‌యూవీ 7XO లాంచ్‌తో దుమ్మురేపిన మహీంద్రా, ఇప్పుడు తన మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీ స్కోర్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురావడానికి రెడీ అయ్యింది. ప్రస్తుతం రోడ్ల మీద టెస్టింగ్ జరుపుకుంటున్న ఈ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాత స్కోర్పియో కంటే మరింత స్టైలిష్‌గా, అదిరిపోయే ఫీచర్లతో రాబోతున్న ఈ కొత్త వెర్షన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మహీంద్రా స్కోర్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్ రూపం గురించి చెప్పాలంటే.. దీనికి భారీ మార్పులేమీ చేయకుండానే చాలా ప్రీమియం లుక్‌ను జోడించారు. ముందు భాగంలో గ్రిల్ డిజైన్‌ను కొంచెం మార్చారు, ఎయిర్ డ్యామ్ దగ్గర కొత్త పట్టీలను అమర్చారు. కారు సిగ్నేచర్ సి-ఆకారపు ఎల్‌ఈడీ హెడ్ లైట్లు, ఫాగ్ ల్యాంప్స్ అలాగే ఉన్నప్పటికీ, ఫ్రంట్ బంపర్ డిజైన్‌లో చిన్న చిన్న మార్పులు చేసి మరింత అగ్రెసివ్ లుక్‌ను తీసుకొచ్చారు. సైడ్ ప్రొఫైల్‌లో ప్రధానంగా 18-ఇంచుల కొత్త అల్లాయ్ వీల్స్ మనల్ని ఆకట్టుకుంటాయి. 5-స్పోక్ డిజైన్‌తో వచ్చే ఈ వీల్స్ కారుకు ఒక పవర్‌ఫుల్ లుక్‌ను ఇస్తున్నాయి. వెనుక భాగంలో టెయిల్ ల్యాంప్స్ గ్రాఫిక్స్‌ను కూడా కొద్దిగా అప్‌డేట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే.. మహీంద్రా తన థార్ రాక్స్ స్ఫూర్తితో లోపల విప్లవాత్మక మార్పులు చేసింది. ఇప్పుడు ఉన్న 8-ఇంచుల స్క్రీన్ స్థానంలో ఏకంగా 10.25-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. దీని కోసం సెంటర్ కన్సోల్ మొత్తాన్ని రీ-డిజైన్ చేశారు. ఏసీ వెంట్ల స్థానాన్ని మార్చి, వాటి చుట్టూ సిల్వర్ బార్డర్ ఇచ్చి మరింత క్లాసీగా మార్చారు. డ్రైవర్ కోసం కూడా అనలాగ్ మీటర్ల స్థానంలో 10.25-ఇంచుల ఫుల్లీ డిజిటల్ డిస్ప్లేను పరిచయం చేస్తున్నారు. ఇవన్నీ కలిసి స్కోర్పియో-ఎన్‌ను ఒక లగ్జరీ ఎస్‌యూవీగా మార్చేస్తున్నాయి.

ఇంజన్ పరంగా చూస్తే మహీంద్రా తన నమ్మకమైన పవర్ హౌస్‌లనే కొనసాగిస్తోంది. ఇందులో 203 hp ఇచ్చే 2.0-లీటర్ టర్బో-పెట్రోల్, 175 hp ఇచ్చే 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉంటాయి. వీటికి 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లను జత చేశారు. హై-ఎండ్ డీజిల్ వేరియంట్లలో ఎప్పటిలాగే 4x4 గన్ పవర్ ఉంటుంది. ప్రయాణం మరింత సాఫీగా ఉండటానికి ఎక్స్‌యూవీ 7XO లో వాడిన దా వించి డాంపర్లను ఇందులో కూడా వాడే అవకాశం ఉంది. మొత్తానికి, పాత స్కోర్పియో రఫ్ అండ్ టఫ్ లుక్‌ను కాపాడుకుంటూనే, ఆధునిక టెక్నాలజీతో ఈ ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories