Mahindra BE 6 and XEV 9e Crash Test: సేఫ్టీలో మహీంద్రా హవా.. ఈ రెండు కార్లకు 5 స్టారే రేటింగ్

Mahindra BE 6 and XEV 9e Crash Test
x

Mahindra BE 6 and XEV 9e Crash Test: సేఫ్టీలో మహీంద్రా హవా.. ఈ రెండు కార్లకు 5 స్టారే రేటింగ్

Highlights

Mahindra BE 6 and XEV 9e Crash Test: దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా ఇటీవల తన రెండు కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ BE 6, XEV 9eలను పరిచయం చేసింది.

Mahindra BE 6 and XEV 9e Crash Test: దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా ఇటీవల తన రెండు కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ BE 6, XEV 9eలను పరిచయం చేసింది. వీటి ధరలు వరుసగా రూ.18.90 లక్షలు, రూ.21.90 లక్షలు. ఇప్పుడు ఈ రెండు SUVల క్రాష్ టెస్ట్ లో ఇవి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించాయి. భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (BNCAP) క్రాష్ టెస్ట్ చేసింది.


Mahindra BE 6 Crash Test

అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP) టెస్ట్‌లో BE 6 32కి 31.97 స్కోర్ చేసింది. డ్రైవర్, కో-డ్రైవింగ్ సీటు ప్రయాణీకుల తల, మెడ, ఛాతీకి మంచి రక్షణ లభించిందని ఈ నివేదిక తెలిపింది. కానీ డ్రైవర్ మోకాళ్లకు 'తగినంత' రక్షణను కల్పించకపోవడం వల్ల కొన్ని పాయింట్లను కోల్పోయింది. సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో ఎస్‌యూవీ 16.00కి 16.00 స్కోర్ చేసింది. సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో ఇది బాగానే ఉన్నట్లు తేలింది.

పిల్లల భద్రతలో చైల్డ్ ఓక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP) టెస్ట్‌లో BE 6 49 పాయింట్లకు 45 పాయింట్లు సాధించింది. డైనమిక్ టెస్ట్‌లో 24 మార్కులకు 24 వచ్చాయి. అయితే CRS ఇన్‌స్టాలేషన్ టెస్ట్‌లో ఎస్‌యూవీ 12 పాయింట్లకు గానూ 12 పాయింట్లను సాధించింది. ఇది కాకుండా వెహికల్ స్టెబిలిటీ టెస్ట్‌లో 13 మార్కులకు 9 మార్కులు వచ్చాయి. పిల్లల సేఫ్టీ టెస్ట్ కోసం 18 నెలల, 3 సంవత్సరాల పిల్లల డమ్మీ బొమ్మలను పరీక్షించారు.

భారత్ NCAP ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాప్-స్పెక్ ప్యాక్ త్రీ వేరియంట్‌ను 79kWh బ్యాటరీ ప్యాక్‌తో పరీక్షించింది. కానీ ఈ సేఫ్టీ రేటింగ్ చిన్న బ్యాటరీ ప్యాక్ (59kWh) వేరియంట్‌కు కూడా వర్తిస్తుందని నివేదిక పేర్కొంది.

Mahindra XEV 9e Crash Test

XEV 9e రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్ వేరియంట్‌లతో వస్తుంది (59kWh - 79 kWh). ఈ క్రాష్ టెస్ట్‌లో ఈ ఎస్‌యూవీ 5-స్టార్ రేటింగ్‌ సాధించింది. ఆల్-ఎలక్ట్రిక్ SUVకి అడల్ట్ ఆక్యుపెన్సీ ప్రొటెక్షన్ (AOP) కోసం 32 పాయింట్లలో 32 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెన్సీ ప్రొటెక్షన్ (COP) కోసం 45/49 పాయింట్లు పొందింది.

ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లలో XEV 9e రెండింటిలోనూ 16కి పూర్తి 16 పాయింట్లను స్కోర్ చేసింది. దీని కారణంగా ఈ SUV అడల్ట్ సేఫ్టీలో గరిష్టంగా 32 పాయింట్లను స్కోర్ చేసింది. దీంతో BNCAP ద్వారా టెస్ట్ చేసిన మొదటి కారుగా అవతరించింది. XEV 9e కూడా సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో మంచి రేటింగ్ చూపిస్తుంది.

XEV 9e చైల్డ్ ప్రొటెక్షన్ స్కోర్ గురించి మాట్లాడితే ఈ ఎలక్ట్రిక్ SUV డైనమిక్ టెస్ట్‌లో 24కి 24 పాయింట్లను సాధించింది. ఇది కాకుండా CRS ఇన్‌స్టాలేషన్ అసెస్‌మెంట్‌లో SUV 12కి 12 స్కోర్ చేసింది. దీని కారణంగా ఈ ఎస్‌యూవీ పిల్లల భద్రత పరంగా మొత్తం 49 పాయింట్లలో 45 పాయింట్లను సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories