Mahindra Thar Roxx Waiting Period: థార్ రాక్స్‌ క్రేజ్ వేరబ్బా.. బంగారానికి ఉన్నంత డిమాండ్.. వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుసా..?

Mahindra Thar Roxx Waiting Period
x

Mahindra Thar Roxx Waiting Period: థార్ రాక్స్‌ క్రేజ్ వేరబ్బా.. బంగారానికి ఉన్నంత డిమాండ్.. వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుసా..?

Highlights

Mahindra Thar Roxx Waiting Period: ఇండియన్ ఆటోమొబైల్ మేకర్ మహీంద్రా గతేడాది థార్ రాక్స్‌ని విడుదల చేసింది.

Mahindra Thar Roxx Waiting Period: ఇండియన్ ఆటోమొబైల్ మేకర్ మహీంద్రా గతేడాది థార్ రాక్స్‌ని విడుదల చేసింది. ఈ కారు అద్భుతమైన డిజైన్, ఆఫ్ రోడింగ్ కెపాసిటీ కంపెనీకి మంచి లాభాలను తెచ్చిపెట్టింది. మార్కెట్లో థార్ రాక్స్‌కు భారీ డిమాండ్ ఉంది. ఈ కారణంగా థార్ రాక్స్ వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువగా ఉంది. అయితే ఈ ఎస్‌యూవీని మీరు ఇంటికి తీసుకెళ్లడానికి ఎన్ని రోజులు వేచి ఉండాలి? ఎప్పుడు డెలివరీ అవుతుంది? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మహీంద్రా థార్ రాక్స్‌పై గరిష్టంగా 18 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. కంపెనీ వెయిటింగ్ పీరియడ్‌కు సంబంధించిన సమాచారాన్ని డీలర్‌లకు అందించింది. ఈ ఎస్‌యూవీ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి.

వేరియంట్‌ల విషయానికి వస్తే.. బేస్ వేరియంట్ MX1, టాప్ వేరియంట్స్ AX7L 4X4, డీజిల్ MT, AT పై 18 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. థార్ రాక్స్ మిడ్ వేరియంట్‌ల వలె, MX3, AX3L, MX5, AX5L వేరియంట్‌ల కోసం దాదాపు 6 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. అయితే AX7L 4X2 వేరియంట్‌పై గరిష్టంగా 10 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. థార్ రోక్స్ ధర రూ. 12.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

మహీంద్రా థార్ రాక్స్‌లో 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ ఉంది. ఈ ఇంజన్ 162 హెచ్‌పి హార్స్‌పవర్, 330 ఎన్ఎమ్ టార్క్‌ రిలీజ్ చేస్తుంది. ఇందులో మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంది. మహీంద్రా థార్ రాక్స్‌లో హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్‌‌ను చూడొచ్చు. ఈ ఎస్‌యూవీలో 5 మంది సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories