Mahindra Scorpio N: సరికొత్త చరిత్రను సృష్టించిన మహీంద్రా.. స్కార్పియో ఎన్ రికార్డ్ సేల్స్..!

Mahindra Scorpio N
x

Mahindra Scorpio N: సరికొత్త చరిత్రను సృష్టించిన మహీంద్రా.. స్కార్పియో ఎన్ రికార్డ్ సేల్స్..!

Highlights

Mahindra Scorpio N: మహీంద్రా స్కార్పియో ఎన్ ప్రముఖ ఎస్‌యూవీగా అవతరించింది. ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్ల కారణంగా భారీ సంఖ్యలో అమ్ముడవుతోంది.

Mahindra Scorpio N: మహీంద్రా స్కార్పియో ఎన్ ప్రముఖ ఎస్‌యూవీగా అవతరించింది. ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్ల కారణంగా భారీ సంఖ్యలో అమ్ముడవుతోంది. ప్రస్తుతం స్కార్పియో ఎన్ విక్రయాల్లో కంపెనీ సరికొత్త చరిత్రను లిఖించింది. కారు మార్కెట్లోకి వచ్చినప్పటి నుండి దాదాపు 200,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీనికి గుర్తుగా 'స్కార్పియో-ఎన్ కార్బన్ ఎడిషన్'ను విడుదల చేసింది. దాని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

కొత్త మహీంద్రా స్కార్పియో ఎన్ కార్బన్ ఎడిషన్ ఎస్‌యూవీ ధర రూ. 19.19 లక్షల నుండి రూ. 24.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). 7-సీటర్ ఆప్షన్‌తో, కారు Z8, Z8L వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. స్కార్పియో ఎన్ కార్బన్ ఎడిషన్ ఎడిషన్ సాధారణ స్కార్పియో ఎన్ మాదిరిగానే ఉంటుంది. ఆకర్షణీయమైన హెడ్‌లైట్స్, టెయిల్ లైట్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి.

ఈ కారు లోపల పేరుకు తగ్గట్టుగా బ్లాక్ కలర్ థీమ్ ఆధారంగా డిజైన్ చేశారు. ఇందులో డజన్ల కొద్దీ ఫీచర్లు కూడా ఉన్నాయి. 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ క్లస్టర్, 12-స్పీకర్ సోనీ సౌండ్ సిస్టమ్, సింగిల్-పేన్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటో ఏసీ, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, వైపర్‌లు హైలైట్‌లలో ఉన్నాయి.

కొత్త మహీంద్రా స్కార్పియో ఎన్ కార్బన్ ఎడిషన్‌లో 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంది. ఈ కారు లీటర్‌పై 12.12 నుండి 15.94 kmpl మైలేజీని ఇస్తుంది.

ఈ కారులో ప్రయాణీకుల రక్షణ కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్,అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్,టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్‌లు, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.

అలాగే, మహీంద్రా కంపెనీ 200,000 యూనిట్ల స్కార్పియో ఎన్ ఎస్‌యూవీని విక్రయించింది, ఇది నిజంగా మంచి పరిణామం. కొత్త కార్బన్ ఎడిషన్ కూడా ఆకర్షణీయమైన డిజైన్‌‌లో ఉన్నందున మంచి సంఖ్యలో అమ్ముడవుతుందని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ కారుకు దేశీయ కస్టమర్ల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories