Mahindra Bolero: సరికొత్త లుక్ లో మహీంద్ర బొలెరో.. స్కార్పియో కన్నా రఫ్ లుక్, అదిరిపోయే ఫీచర్లు..!

Mahindra Bolero in New Avatar More Attractive Look Than Scorpio Key Changes Revealed
x

Mahindra Bolero: సరికొత్త లుక్ లో మహీంద్ర బొలెరో.. స్కార్పియో కన్నా రఫ్ లుక్, అదిరిపోయే ఫీచర్లు..!

Highlights

Mahindra Bolero: దేశంలోనే అతిపెద్ద ఎస్‌యూవీల తయారీ సంస్థ మహీంద్రా, తమ అత్యంత ప్రజాదరణ పొందిన వాహనం బొలెరోను సరికొత్త లుక్ లో త్వరలో విడుదల చేయనుంది.

Mahindra Bolero: దేశంలోనే అతిపెద్ద ఎస్‌యూవీల తయారీ సంస్థ మహీంద్రా, తమ అత్యంత ప్రజాదరణ పొందిన వాహనం బొలెరోను సరికొత్త లుక్ లో త్వరలో విడుదల చేయనుంది. మహీంద్రా చాలా కాలంగా బొలెరో కొత్త జనరేషన్ మోడల్‌పై పనిచేస్తోంది. ఇటీవల, కొత్త బొలెరో టెస్ట్ మోడల్ రహస్యంగా కనిపించింది. కొత్త బొలెరోను వచ్చే ఏడాది నాటికి మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. మోటోవ్యాగన్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొత్త బొలెరో పూర్తిగా క్యామోఫ్లేజ్‌తో కప్పబడి టెస్ట్ చేయబడుతున్న వీడియోను పోస్ట్ చేశారు.

వీడియోలో కనిపించిన మహీంద్రా బొలెరో.. ప్రస్తుతం దాదాపు 25 సంవత్సరాలుగా భారత మార్కెట్‌లో విక్రయించబడుతున్న మోడల్‌కు పూర్తిగా భిన్నంగా ఉంది. మహీంద్రా ఫ్లాట్ రూఫ్‌లైన్, టెయిల్ పిల్లర్‌లతో బాక్స్ ప్రొఫైల్‌ను అలాగే ఉంచినప్పటికీ మొత్తం డిజైన్ ప్రస్తుత బొలెరో నుంచి కంప్లీట్ డిఫరెంటుగా ఉంటుంది. కొత్త బొలెరో అంచులు మరింత గుండ్రంగా ఉన్నాయి. ఇవి మహీంద్రా కొత్త-జనరేషన్ స్కార్పియో-ఎన్ (Scorpio-N)ను పోలి ఉన్నాయి.

ఎస్‌యూవీలో కీలక మార్పులు

క్యామోఫ్లేజ్‌తో కప్పబడి ఉన్న బొలెరో డిజైన్ ఫీచర్స్ ఎక్కువగా కనిపించలేదు. అయితే రాబోయే ఎస్‌యూవీలో కొన్ని పెద్ద మార్పులు ఉండవచ్చని అంచనా వేయవచ్చు. న్యూ జనరేషన్ బొలెరో ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ డిఫరెంట్ లుక్ ఇస్తుంది. ఇందులో మధ్యలో మహీంద్రా ట్విన్ పీక్స్ లోగోతో స్లేటెడ్ గ్రిల్, కొత్త గుండ్రని ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు ఉన్నాయి.

అప్‌డేట్ కానున్న ఫీచర్లు

అంతేకాకుండా.. ముందు, వెనుక బంపర్‌లతో పాటు ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్ ఎస్‌యూవీ లుక్ మరింత మెరుగుపరుస్తాయి. అత్యంత ఆసక్తికరమైన విషయాలలో ఒకటి ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, ఇవి ఎస్‌యూవీకి మరింత లేటెస్ట్ లుక్ ఇస్తాయి. పెద్ద అల్లాయ్ వీల్స్‌ను, అలాగే రీ డిజైన్ చేసిన ORVMలను కలిగి ఉందని కూడా తెలుస్తుంది. వెనుక వైపున ఇందులో నిలువు LED టైల్‌ల్యాంప్‌లు, ఫ్లే సైడ్-హింగెడ్ టెయిల్‌గేట్ ఉన్నాయి. ప్రస్తుత మోడల్ మాదిరిగానే, మహీంద్రా బొలెరో ప్రాక్టికల్ ఎక్స్ పీరియన్స్ కొనసాగించడానికి స్పేర్ వీల్‌ను టెయిల్ గేట్‌పైనే ఉంచడానికి స్థలాన్ని కేటాయించింది.

మహీంద్రా కొత్త ప్లాట్‌ఫామ్

మహీంద్రా కొత్త ఎన్‌ఎఫ్‌ఏ ప్లాట్‌ఫామ్ (NFA Platform) ఈ సంవత్సరం ఆగస్టు 15న ప్రారంభం కానుంది. ఇది ఒక కొత్త కాన్సెప్ట్ వాహనానికి పునాదిగా పనిచేస్తుంది. ఈ ఈవెంట్‌లో నెక్ట్స్ జనరేషన్ బొలెరోను కాన్సెప్ట్‌గా ప్రదర్శించవచ్చని అంచనా వేస్తున్నారు. మహీంద్రా లైనప్‌లో బొలెరో నిలకడగా మంచి పనితీరు కనబరుస్తోంది. ముఖ్యంగా టైర్ 3 నగరాలు, గ్రామీణ ప్రాంతాలలో ఈ ఎస్‌యూవీకి చాలా ఆదరణ ఉంది. ఇప్పుడు కొత్త అప్‌డేట్‌లతో ఇది పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రజాదరణ పొందవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories