Mahindra XEV 9e And BE 6 Record Bookings: మహీంద్రా ఈవీలు కొత్త రికార్డ్.. మొదటి రోజే రూ. 8,472 కోట్ల బుకింగ్స్

Mahindra XEV 9e And BE 6 Record Bookings: మహీంద్రా ఈవీలు కొత్త రికార్డ్.. మొదటి రోజే రూ. 8,472 కోట్ల బుకింగ్స్
x
Highlights

Mahindra XEV 9e And BE 6 Record Bookings: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా గట్టి ప్లాన్‌తో వచ్చేసింది.

Mahindra XEV 9e And BE 6 Record Bookings: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా గట్టి ప్లాన్‌తో వచ్చేసింది. బ్రాండ్ నుంచి రెండు కొత్త ఈవీలను లాంచ్ చేసింది. BE6, XEV9e పేరుతో వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటి బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ కార్లు మొదటి రోజు 30,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను సాధించాయి. ఇప్పటి వరకు దేశంలో ఏ ఎలక్ట్రిక్ కార్లకు ఇన్ని బుకింగ్స్ రాలేదు. ఈ రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల బుకింగ్ వాల్యూ ఎక్స్-షోరూమ్ ధర ప్రకారం రూ. 8472 కోట్లు. ఈ రెండు వాహనాల ధర, ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

అధికారిక సమాచారం ప్రకారం.. ఈ రెండు ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు మొదటి రోజు 30,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను సాధించాయని మహీంద్రా తెలిపింది. ఈ విధంగా XEV 9e, BE 6 మొదటి రోజు రూ. 8472 కోట్లు వసూలు చేసింది. 30 వేల యూనిట్లను పూర్తి చేయడంలో BE 6కి 56 శాతం, XEV 9eకి 44 శాతం వాటా ఉంది.

మహీంద్రా XEV 9e, BE 6 డెలివరీ మార్చి 2025 మధ్య నుండి ప్రారంభమవుతుంది. ప్యాక్ త్రీ సెలెక్ట్, ప్యాక్ టూ డెలివరీ టైమ్‌లైన్ జూన్ నుంచి ప్రారంభమవుతుంది. ప్యాక్ వన్, ప్యాక్ వన్ ఎబోవ్ అనే ఎంట్రీ లెవల్ వేరియంట్‌ల డెలివరీలు ఆగస్టు 2025లో ప్రారంభమవుతాయి.

మహీంద్రా BE 6 ఎక్స్-షోరూమ్ ధర రూ. 18.90 లక్షల నుండి రూ. 26 లక్షల మధ్య ఉంది. మహీంద్రా XEV 9e ధర రూ. 21.90 లక్షల నుండి మొదలై, రూ. 30.50 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ రెండు e-SUVలు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ సాధించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories