Suzuki e-Vitara: భారత్ నుంచే ప్రపంచానికి..సుజుకి 'ఇ-విటారా' బ్రిటన్‌లో గ్రాండ్‌గా లాంచ్!

Suzuki e-Vitara
x

Suzuki e-Vitara: భారత్ నుంచే ప్రపంచానికి..సుజుకి 'ఇ-విటారా' బ్రిటన్‌లో గ్రాండ్‌గా లాంచ్!

Highlights

Suzuki e-Vitara: సుజుకి తన మొదటి ఆల్-ఎలక్ట్రిక్ వెహికల్ ఇ-విటారాను యునైటెడ్ కింగ్‌డమ్లో లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర 29,999 పౌండ్లు (సుమారు 35 లక్షలు) కాగా, టాప్ వేరియంట్ ధర 37,799 పౌండ్లు (సుమారు 44 లక్షలు)గా నిర్ణయించారు.

Suzuki e-Vitara: సుజుకి తన మొదటి ఆల్-ఎలక్ట్రిక్ వెహికల్ ఇ-విటారాను యునైటెడ్ కింగ్‌డమ్లో లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర 29,999 పౌండ్లు (సుమారు 35 లక్షలు) కాగా, టాప్ వేరియంట్ ధర 37,799 పౌండ్లు (సుమారు 44 లక్షలు)గా నిర్ణయించారు. ఈ కారు భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సుజుకి ప్లాంట్‌లో తయారవుతోంది. అక్కడి నుండి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతోంది. ఈ కారు భారతదేశంలో ఈ ఏడాది చివరి నాటికి రిలీజ్ కానుంది.

యూకేలో సుజుకి ఇ-విటారాను రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. మోషన్, అల్ట్రా. మోషన్ వేరియంట్లో 49 kWh బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీతో ఇ-విటారా ఒకసారి ఛార్జ్ చేస్తే 346 కి.మీ (WLTP) వరకు ప్రయాణించగలదు.అల్ట్రా వేరియంట్లో 61 kWh పెద్ద బ్యాటరీ ఉంటుంది. ఈ వేరియంట్లలో కూడా సుజుకి ఆల్‌గ్రిప్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది. ఇది నాలుగు చక్రాలకు పవర్ అందిస్తుంది. 61 kWh బ్యాటరీతో ఈ కారు 428 కి.మీ వరకు వెళ్లగలదు.

కంపెనీ యూకేలో కారు, బ్యాటరీపై 10 సంవత్సరాలు లేదా 1,60,000 కి.మీ వారంటీ ఇస్తోంది. ఇ-విటారాలోని లోయర్ వేరియంట్‌లోఒక సింగిల్ మోటార్ ఉంటుంది. ఇది 142 బీహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీని టాప్ వేరియంట్లలో డ్యూయల్ మోటార్ సెటప్ ఉంటుంది, ఇది 4WD తో వస్తుంది. 178 బీహెచ్‌పి పవర్, 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ డ్యూయల్ మోటార్ కేవలం 61 kWh బ్యాటరీతో మాత్రమే లభిస్తుంది. దీని రేంజ్ కొద్దిగా తగ్గి 412 కి.మీ అవుతుంది.

భారతదేశంలో ఇ-విటారా మొదటిసారి జనవరి 2025లో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కనిపించింది. దీనిని మార్చి 2025 నాటికి లాంచ్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు దాని లాంచింగ్ సెప్టెంబర్ 2025 వరకు వాయిదా పడింది. ఇ-విటారా తో పాటు, సుజుకి ఇదే తరహాలో మరొక ఎలక్ట్రిక్ మోడల్ టయోటా అర్బన్ క్రూజర్ ఈవీను కూడా భారతదేశంలో తయారు చేస్తుంది. దీనిని కూడా భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించారు. అయితే, టయోటా ఇండియా దీని లాంచింగ్ తేదీని ఇంకా ప్రకటించలేదు. షో-రూమ్‌లలో మొదట ఇ-విటారానే వస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

సుజుకి మొదట సంవత్సరానికి దాదాపు 70,000 యూనిట్ల ఇ-విటారాను తయారు చేయాలని యోచిస్తోంది.వీటిలో ఎక్కువ భాగం ఎగుమతుల కోసమే. అయితే, రేర్ ఎర్త్ మాగ్నెట్ల కొరత కారణంగా 2026ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాలలో ఉత్పత్తి ప్రణాళికలో మార్పు చేశారు. ఇప్పుడు కంపెనీ ఈ కాలంలో 26,500 యూనిట్లకు బదులుగా కేవలం 8,200 యూనిట్లను మాత్రమే తయారు చేస్తుంది. ఇప్పుడు మారుతి సెప్టెంబర్ 2025 గడువులోగా ఇ-విటారాను భారతదేశంలో లాంచ్ చేయగలదా లేదా అది మళ్లీ వాయిదా పడుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories