Toyota India: ఫుల్ జోష్‌లో టయోటా.. అంచనాలను మించిన లాభాలు..!

Toyota India: ఫుల్ జోష్‌లో టయోటా.. అంచనాలను మించిన లాభాలు..!
x

Toyota India: ఫుల్ జోష్‌లో టయోటా.. అంచనాలను మించిన లాభాలు..!

Highlights

Toyota India: టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా దేశంలో ప్రసిద్ధ కార్ల తయారీ సంస్థ. కంపెనీకి కర్ణాటకలోని బిడాడిలో భారీ తయారీ యూనిట్ ఉంది, అనేక కార్లను విజయవంతంగా విక్రయిస్తోంది.

Toyota India: టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా దేశంలో ప్రసిద్ధ కార్ల తయారీ సంస్థ. కంపెనీకి కర్ణాటకలోని బిడాడిలో భారీ తయారీ యూనిట్ ఉంది, అనేక కార్లను విజయవంతంగా విక్రయిస్తోంది. వినియోగదారులు కూడా కొనుగోలు చేసేందుకు సుముఖంగా ఉన్నారు. ఇప్పుడు కంపెనీ ఫిబ్రవరి నెలలో మొత్తం కార్ల అమ్మకాల గణాంకాల నివేదికను వెల్లడించింది. కంపెనీ అంచనాలకు మించి పురోగతి సాధించింది.

గత నెల (ఫిబ్రవరి - 2025), టయోటా కిర్లోస్కర్ మోటార్ మొత్తం 28,414 యూనిట్ల కార్లను విక్రయించింది. 2024లో ఇదే కాలంలో విక్రయించిన 25,220 యూనిట్లతో పోల్చితే, సంవత్సరానికి (YoY) వృద్ధి 13శాతం. ముఖ్యంగా టొయోటా దేశీయ మార్కెట్లో 26,414 యూనిట్ల కార్లను విక్రయించగా, విదేశాలకు 2,000 యూనిట్లను ఎగుమతి చేసింది. ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హిక్రాస్, అర్బన్ క్రూయిజర్ హైరైడర్, టైసర్, గ్లాంజా, హిలక్స్, ఫార్చ్యూనర్,రూమియన్ కార్లు టయోటా ఈ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం.

Toyota Glanza

టయోటా విక్రయించిన కార్లలో గ్లాంజా హ్యాచ్‌బ్యాక్ విషయానికి వస్తే.. ఈ కారు ధర రూ.6.90 లక్షల నుండి రూ.10 లక్షల మధ్య ఉంటుంది . ఇందులో 1.2-లీటర్ పెట్రోల్, సిఎన్‌జి ఇంజన్ ఉంది. 22.35 నుండి 30.61 kmpl మైలేజీని అందిస్తుంది. వివిధ ఫీచర్లు 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉన్నాయి.

Toyota Urban Cruiser Taisor

టయోటా అర్బన్ క్రూయిజర్ టైసర్ ఎస్‌‌యూవీ కారు ధర రూ.7.74 లక్షల నుండి రూ.13.04 లక్షలు (ఎక్స్-షోరూమ్). 1-లీటర్ టర్బో పెట్రోల్, సిఎన్‌జి ఇంజన్ ఉంటుంది. 19.8 నుండి 28.5 kmpl మైలేజీని అందిస్తుంది. ఇందులో 5 మంది కూర్చోవచ్చు.

Toyota Rumion

టయోటా రూమియన్ ఎమ్‌పివి ధర రూ.10.54 లక్షల నుండి రూ.13.83 లక్షలు ఎక్స్-షోరూమ్. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్, సిఎన్‌జి ఇంజన్లు ఉన్నాయి. 20.11 నుండి 26.11 kmpl మైలేజీని కూడా ఇస్తుంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సహా అనేక ఫీచర్స్ చూడొచ్చు.

Toyota Innova

టయోటా ఇన్నోవా ఎమ్‌పివి ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హిక్రాస్ అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇన్నోవా క్రిస్టా రూ.19.99 లక్షల నుండి రూ.26.82 లక్షలు, ఇన్నోవా హిక్రాస్ రూ.19.94 లక్షల నుండి రూ.31.34 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories