Kia Launches EV2 Electric SUV: కియా కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV లాంచ్.. ధర ఎంతంటే..?

Kia Launches EV2 Electric SUV
x

Kia Launches EV2 Electric SUV: కియా కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV లాంచ్.. ధర ఎంతంటే..?

Highlights

Kia Launches EV2 Electric SUV: సౌత్ కొరియన్ ఆటో మోబైల్ సంస్థ కియా సరికొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV EV2ను ఆవిష్కరించింది.

Kia Launches EV2 Electric SUV: సౌత్ కొరియన్ ఆటో మోబైల్ సంస్థ కియా సరికొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV EV2ను ఆవిష్కరించింది. యూరోపియన్ మార్కెట్ కోసం అతి చిన్న, అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ మోడల్ ను తీసుకొచ్చింది. కాంపాక్ట్ సైజ్, ఎక్కువ రేంజ్ కోరుకునే యూరోపియన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ మోడల్‌ను కియా రూపొందించింది. పూర్తిగా ఎలక్ట్రిక్ B సెగ్మెంట్ SUV EV2ని బ్రస్సెల్స్ మోటార్ షోలో ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేసింది. ఇది కియా EV ఎలక్ట్రిక్ కార్ లైనప్‌ నుంచి వచ్చిన ఆరవ మోడల్‌ గా గుర్తింపు తెచ్చుకుంది. B సెగ్మెంట్ యూరోపియన్ విభాగంలో భాగంగా వస్తోంది. ఇందులో చిన్న, సబ్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఉన్నాయి. యూరప్‌లో ఎంట్రీ లెవల్ EVలపై పోటీ పెరుగుతున్న సమయంలో EV2 లాంచ్ కావడం విశేషం.

ఫిబ్రవరి 2026 నుంచి ఉత్పత్తి ప్రారంభం EV2 ఉత్పత్తి ఫిబ్రవరిలో స్లోవేకియా జిలినాలోని ప్లాంట్‌ లో ప్రారంభం కానున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇతర బ్రాండ్ల నుంచి పోటీ పెరిగిన నేపథ్యంలో యూరప్‌ లో కియా మార్కెట్ వాటాను పెంచుకునేందుకు గాను, ఈ మోడల్ కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ఈ కారు 4,060 మిల్లీ మీటర్లు పొడవు, 1,800 మిల్లీమీటర్లు వెడల్పు, 1,575 మిల్లీమీటర్ల ఎత్తుతో ఉంటుంది. EV2 అనేది కియా నుంచి వచ్చిన అతి చిన్న EV.

ఇక EV2 లాంగ్ రేంజ్ మోడల్ 61 kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది ఒకే ఛార్జ్‌ పై ఏకంగా 448 కిలో మీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ ను అందిస్తుంది. 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి దాదాపు 30 నిమిషాలు పడుతుంది. ఇది ప్లగ్ అండ్ ఛార్జ్ కెపాసిటీతో కూడా అమర్చబడి ఉంటుంది. ఛార్జింగ్ కేబుల్‌ ను వాహనానికి కనెక్ట్ చేయడం ద్వారా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ స్టేషన్లలోనూ సులభంగా ఛార్జింగ్ చేయించుకునే అవకాశం ఉంటుంది.

EV2 కియాకు అత్యంత కాంపాక్ట్ ఎలక్ట్రిక్ వాహనం అని కియా CEO సాంగ్ హో సంగ్ చెప్పారు. అయినప్పటికీ ఇది అత్యంత శక్తివంతమైన ఇంటీరియర్ అనుభవాన్ని అందిస్తుందన్నారు. విశాలమైన డిజైన్, విభిన్న రకాల వినియోదారుల అభిరుచులను పరిగణలోకి తీసుకుని ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేసినట్లు తెలిపారు. అందుకే, తమ ఈవీలు మార్కెట్ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నట్లు వెల్లడించారు.

అటు జనవరి 18 వరకు జరిగే బ్రస్సెల్స్ మోటార్ షోలో, కియా తన గ్లోబల్ ఎలక్ట్రిక్ పోర్ట్‌ ఫోలియోను విస్తరిస్తూ కీలక ప్రకటనలు చేయనున్నట్లు తెలిపింది. అందులో భాగంగా EV2, EV3, EV4, EV5, EV9, PV5లతో సహా 19 ఎలక్ట్రిఫైడ్ మోడళ్లను ప్రదర్శిస్తున్నట్లు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా సరసమైన ధరలకు, మంచి రేంజ్ అందించే ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు CEO సాంగ్ హో సంగ్ వివరించారు.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కియా మంచి అమ్మకాలతో సత్తా చాటుతుందన్నారు. త్వరలో విడుదలకాబోయే కొత్త ఈవీ మోడల్స్ తో మార్కెట్ లో తమ వాటాను మరింత పెంచుకోనున్నట్లు తెలిపారు. భారత్‌లో ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, EV2 భవిష్యత్‌లో మన మార్కెట్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్పెసిఫికేషన్లు మార్కెట్‌ను బట్టి మారే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories