Kia Carnival Hi Limousine: కొత్త కారు విడుదల చేసిన కియా.. లగ్జరీ రూమ్‌కంటే తక్కువేమి కాదు..!

Kia Carnival Hi Limousine: కొత్త కారు విడుదల చేసిన కియా.. లగ్జరీ రూమ్‌కంటే తక్కువేమి కాదు..!
x
Highlights

Kia Carnival Hi Limousine: కియా ఇండియా గత ఏడాది దేశంలో కొత్త కార్నివాల్‌ను ప్రారంభించింది.

Kia Carnival Hi Limousine: కియా ఇండియా గత ఏడాది దేశంలో కొత్త కార్నివాల్‌ను ప్రారంభించింది. బ్రాండ్ ఇప్పుడు ఆటో ఎక్స్‌పోలో ఈ MPV మరింత విలాసవంతమైన హై రూఫ్ వెర్షన్‌ కార్నివాల్ హై లిమోసిన్‌ను విడుదల చేసింది. కొత్త మోడల్ 6-సీటర్లలో వస్తుంది. దేశంలోని సాధారణ కార్నివాల్ కంటే ఎక్కువ సౌకర్యవంతమైన ఫీచర్లను అందిస్తుంది. ఈ కొత్త మోడల్ భారతదేశంలో ఇటీవల విడుదల చేసిన వెర్షన్ ఆధారంగా రూపొందించారు. ఈ మోడల్‌లో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే పైన ఇంటిగ్రేట్ చేసిన స్టైలిష్ రూఫ్ బాక్స్. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Kia Carnival Hi Limousine Specifications

హై లిమోసిన్ దాని ప్రస్తుత భారతీయ వేరియంట్‌ని పోలి ఉంటుంది. ఇది అదే డ్యాష్‌బోర్డ్ డిజైన్‌ను కలిగి ఉంది. అయితే, రెండవ వరుసలో రెండు పెద్ద కెప్టెన్ సీట్లు, పొడవాటి లెగ్ సపోర్ట్‌తో హీటింగ్, వెంటిలేషన్‌ను కంట్రోల్ చేయడానికి వ్యక్తిగత స్క్రీన్ సెటప్, AC కంట్రోల్స్, క్యాబిన్ లైట్లు, కర్టెన్‌లు ఉన్నాయి, ఇవి కారులో మరింత సౌకర్యాన్ని అందిస్తాయి. ఈ మోడల్‌లో ఇన్ఫోటైన్‌మెంట్, డ్రైవర్ క్లస్టర్ కోసం రెండు 12.3-అంగుళాల, 11-అంగుళాల హెచ్‌యుడిలు, 12-వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, 8-వే పవర్డ్ ప్యాసింజర్ సీట్‌లు ఉన్నాయి. భద్రత గురించి మాట్లాడిడే ఇందులో 8-ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, TPMS, లెవెల్ 2 ADAS ఉన్నాయి.

EV6 Facelift

కియా ఇండియా తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ EV6 కొత్త వెర్షన్‌న ఆటో ఎక్స్‌పోలో పరిచయం చేసింది. ఈ కారు డిజైన్, ఫీచర్లు, పర్ఫామెన్స్ పరంగా బెటర్‌‌గా ఉంటాయి. కొత్త మోడల్ బుకింగ్ శుక్రవారం ప్రారంభమైంది. మే, 2025లో ధర వెల్లడికానుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనం 650 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఉన్న 84 kWh సామర్థ్యంతో బ్యాటరీని కలిగి ఉంది. దీని ఫాస్ట్ ఛార్జర్ కేవలం 18 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. కొత్త EV6తో భారతీయ వినియోగదారులకు పర్యావరణ అవగాహన, తదుపరి తరం సాంకేతికతను అందించడంలో మేము సాహసోపేతమైన అడుగు వేస్తున్నాము" అని Kia ఇండియా మేనేజింగ్ డైరెక్టర్,సీఈఓ గ్వాంగ్యు లీ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories