Kia India launches 2025 Seltos: కియా నుంచి కొత్త ఎస్‌యూవీ.. ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసా..?

Kia India launches 2025 Seltos
x

Kia India launches 2025 Seltos: కియా నుంచి కొత్త ఎస్‌యూవీ.. ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసా..?

Highlights

Kia India launches 2025 Seltos: కియా ఇండియా 2025 సెల్టోలను విడుదల చేసింది. స్మార్ట్‌స్ట్రీమ్ G1.5, D1.5 CRDi VGT ఇంజిన్ ఆప్షన్‌లలో అప్‌డేట్ చేసిన సెల్టోస్‌లో 8 కొత్త వేరియంట్‌లు అందుబాటులోకి వచ్చాయి.

Kia India launches 2025 Seltos: కియా ఇండియా 2025 సెల్టోలను విడుదల చేసింది. స్మార్ట్‌స్ట్రీమ్ G1.5, D1.5 CRDi VGT ఇంజిన్ ఆప్షన్‌లలో అప్‌డేట్ చేసిన సెల్టోస్‌లో 8 కొత్త వేరియంట్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మీరు సెల్టోస్‌ను 24 ట్రిమ్‌లలో కొనుగోలు చేయచ్చు. కొత్త సెల్టోస్ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 11.13 లక్షల (HTE (O) నుండి ప్రారంభమవుతాయి. కాగా, ఎక్స్-లైన్ వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 20.50 లక్షల వరకు ఉంది. కంపెనీ తన ప్రీమియం అప్పీల్‌ను మరింత పెంచింది. డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించిన అనేక అధునాతన ఫీచర్లతో ఈ కారు ఉంటాయి.

Seltos HTE (O)

సెల్టోస్ హెచ్‌టిఈ (O) వేరియంట్‌లో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. 6-స్పీకర్ ఆడియో సిస్టమ్‌తో లీనమయ్యే సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. ఈ వేరియంట్‌లో మెరుగైన విజిబిలిటీ కోసం రియర్ వ్యూ మిర్రర్ ఉంది. HTK స్టైలిష్ డిజైన్ మాదిరిగానే స్టాండర్డ్‌గా కనెక్ట్ చేసిన టెయిల్ ల్యాంప్‌ కూడా చూస్తారు. ఆడియోతో పాటు స్టీరింగ్ వీల్‌పై మ్యూజిక్, కాల్ కంట్రోల్ బటన్స్ అందుబాటులో ఉన్నాయి. వె

Seltos HTK (O)

సెల్టోస్ హెచ్‌టికె (O) వేరియంట్‌లో పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, డీఫాగర్‌తో ఫంక్షనల్ రియర్ వైపర్ ఉన్నాయి. క్రూయిజ్ కంట్రోల్, సొగసైన ఇల్యూమినేటెడ్ పవర్ విండోస్, సౌండ్ కాంబినేషన్‌తో కూడిన వైబ్రెంట్ మూడ్ ల్యాంప్‌ను కూడా ఉంది. మోషన్ సెన్సార్ స్మార్ట్ కీ అధునాతన ఫీచర్స్ వంటి అధునాతన ఫీచర్స్ కనిపిస్తాయి.

Seltos HTK+ (O)

సెల్టోస్ HTK+ (O) బోల్డ్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ , అధునాతన EPB IVTతో డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది, ప్రీమియం Zbara కవర్ ATతో మాత్రమే లభిస్తుంది. టర్న్ సిగ్నల్ LED సీక్వెన్స్ లైట్లతో ఆకర్షణీయమైన ఎమ్ఎఫ్ఆర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, పవర్ ఫుల్ ఎల్ఈడీఫాగ్ ల్యాంప్‌లు, ఆటో ఫోల్డ్ ఓఆర్‌విఎమ్, ప్రాక్టికల్ పార్శిల్ ట్రే, గ్లోసీ బ్లాక్ రేడియేటర్ గ్రిల్ వంటి ఫీచర్స్ చూడచ్చు. అదనంగా ఇందులో క్రోమ్ బెల్ట్ లైన్, ఆర్టిఫిషియల్ లెదర్ నాబ్, మూడ్ ల్యాంప్, భద్రత కోసం మోషన్ సెన్సార్‌తో స్మార్ట్ కీ కూడా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories