Kawasaki Ninja Discounts: కవాసకి బైక్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్.. మిస్ అయితే కొనలేరు..!

Kawasaki Ninja Discounts
x

Kawasaki Ninja Discounts: కవాసకి బైక్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్.. మిస్ అయితే కొనలేరు..!

Highlights

Kawasaki Ninja Discounts: కవాసకి ఈ నెలలో తన మోటార్‌సైకిళ్లపై అద్భుతమైన తగ్గింపులను అందిస్తోంది. నింజా 300, నింజా 650తో పాటు నింజా 500 కోసం కంపెనీ కూపన్‌లను ప్రవేశపెట్టింది.

Kawasaki Ninja Discounts: కవాసకి ఈ నెలలో తన మోటార్‌సైకిళ్లపై అద్భుతమైన తగ్గింపులను అందిస్తోంది. నింజా 300, నింజా 650తో పాటు నింజా 500 కోసం కంపెనీ కూపన్‌లను ప్రవేశపెట్టింది. ఈ స్పోర్ట్స్ మోటార్‌సైకిల్‌పై రూ.15,000 విలువైన ప్రయోజనాలు అందజేస్తున్నారు. నింజా 500 ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.29 లక్షలు, కంపెనీ నింజా 300పై రూ.30,000 తగ్గింపును కూడా అందిస్తోంది.

ఈ మోటార్‌సైకిళ్లపై అందుబాటులో ఉన్న కూపన్‌ ప్రయోజనాలను ఈ నెలాఖరు వరకు మాత్రమే కస్టమర్‌లు వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే, బ్రాండ్ గత కొన్ని నెలల్లో తన ఉత్పత్తులపై ఇలాంటి కూపన్‌లను ప్రవేశపెట్టింది. కిబట్టి, కంపెనీ ఈ ఆఫర్‌ను మరింత పొడిగించవచ్చని కూడా భావిస్తున్నారు. ఇప్పటికైనా వినియోగదారులు ఈ నెలలో ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలి.

కవాసకి నింజా 500 451సిసి, పార్లల్ ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉంటుంది. ఈ ఇంజన్ 9,000ఆర్‌పిఎమ్ వద్ద 44.7బిహెచ్‌పి పవర్, 6,000ఆర్‌పిఎమ్ వద్ద 42.6ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మోటార్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. బైక్‌లో ఎల్ఈడీ హెడ్‌లైట్లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, డ్యూయల్-ఛానల్ ABS ఉన్నాయి. కవాసకి నింజా 500 టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లు, మోనోషాక్‌ను చూడొచ్చు. బ్రేకింగ్ హార్డ్‌వేర్‌లో రెండు చివర్లలో ఒకే డిస్క్ ఉంటుంది.

కవాసకి 2025 మోడల్‌ను కంపెనీ గత నెలలో లాంచ్ చేసింది. ఈ బైక్ చిన్న అప్‌డేట్, కొత్త డాష్‌తో వచ్చింది. మరోవైపు, కవాసకి తన కూల్ బైక్ నింజా 300పై రూ. 30,000 తగ్గింపును ఫిబ్రవరి చివరి వరకు పొడిగించింది. బైక్‌పై ఇప్పటికే ఈ తగ్గింపు అందుబాటులో ఉంది. ఇండియన్ మార్కెట్లో ఈ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.3.43 లక్షలు.

కవాసకి నింజా 300లో పవర్‌ట్రెయిన్‌గా 296సిసి పార్లల్ ట్విన్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ ఉంది. బైక్ ఇంజన్ గరిష్టంగా 39బిహెచ్‌పి పవర్, 26ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. బైక్ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌కు కనెక్ట్ చేసి ఉంటుంది. కస్టమర్లు తమ సమీపంలోని షోరూమ్‌ ద్వారా డిస్కౌంట్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories