MG Hector Discounts: కొత్త కారు కొనాలా..? ఎంజీ హెక్టార్‌పై డిస్కౌంట్లే డిస్కౌంట్లు..!

MG Hector Discounts
x

MG Hector Discounts: కొత్త కారు కొనాలా..? ఎంజీ హెక్టార్‌పై డిస్కౌంట్లే డిస్కౌంట్లు..!

Highlights

MG Hector Discounts: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఈ నెలలో హెక్టర్ ఎస్‌యూవీపై గొప్ప తగ్గింపులను అందిస్తోంది. ఈ కారుపై కంపెనీ రూ.2.20 లక్షల డిస్కౌంట్ ప్రకటించింది.

MG Hector Discounts: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఈ నెలలో హెక్టర్ ఎస్‌యూవీపై గొప్ప తగ్గింపులను అందిస్తోంది. ఈ కారుపై కంపెనీ రూ.2.20 లక్షల డిస్కౌంట్ ప్రకటించింది. ఈ సంవత్సరం హెక్టర్ అమ్మకాల గణాంకాలు బాగా లేవు. ఈ తగ్గింపుతో తన అమ్మకాలను పెంచుకోవాలని కంపెనీ యోచిస్తోంది. జనవరిలో 449 యూనిట్లు, ఫిబ్రవరిలో 515 యూనిట్లను విక్రయించింది. హెక్టర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 14 లక్షలు. టాప్ వేరియంట్‌కు రూ. 22.88 లక్షలకు చేరుకుంటుంది.

MG Hector Engine

హెక్టర్ ఇంజన్ పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే ఇందులో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 143పిఎస్ పవర్, 250ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరొక 2-లీటర్ డీజిల్ ఇంజన్ అందుబాటులో ఉంది, ఇది 170పిఎస్ పవర్, 350ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ స్టాండర్డ్ ఆప్షన్‌ ఉంది. అలానే 8-స్పీడ్ CVT గేర్‌బాక్స్ పెట్రోల్ ఇంజన్‌తో ఆప్షన్‌ కూడా అందించారు.

MG Hector Features

దీని క్యాబిన్ డ్యూయల్-టోన్ ఆర్గైల్ బ్రౌన్, బ్లాక్ ఇంటీరియర్, లెదర్-ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, లెథెరెట్ సీట్ అప్హోల్స్టరీతో ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. ఇతర ఫీచర్లు స్మార్ట్ కీతో పుష్ బటన్ ఇంజిన్ స్టార్ట్/స్టాప్, 17.78 సెంమీ. ఎల్‌సీబీ స్క్రీన్‌తో ఫుల్ డిజిటల్ క్లస్టర్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. సెలెక్ట్ ప్రో, స్మార్ట్ ప్రో వేరియంట్‌లలో పవర్ డ్రైవర్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం లెథెరెట్ సీట్ అప్హోల్స్టరీ క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఎంజీ హెక్టర్ ప్లస్‌లో 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన కొత్త 14-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories