MG Comet Blackstorm Edition: ఎంజీ కామెట్ ఈవీ బ్లాక్ స్మార్ట్ ఎడిషన్.. ఫీచర్స్, రేంజ్ అదిరిపోయింది..!

MG Comet Blackstorm Edition
x

MG Comet Blackstorm Edition: ఎంజీ కామెట్ ఈవీ బ్లాక్ స్మార్ట్ ఎడిషన్.. ఫీచర్స్, రేంజ్ అదిరిపోయింది..!

Highlights

MG Comet Blackstorm Edition: దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కార్ కంపెనీలు కూడా తమ అమ్మకాలను ఎలాగైనా పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

MG Comet Blackstorm Edition: దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కార్ కంపెనీలు కూడా తమ అమ్మకాలను ఎలాగైనా పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా దేశంలో తన చౌకైన ఎలక్ట్రిక్ కార్ కామెట్ ఈవీ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌ను కూడా విడుదల చేసింది. కేవలం రూ. 11,000 చెల్లించి డీలర్‌షిప్‌కి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. ఈ ఎడిషన్‌లో ఎటువంటి స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి? ధర ఎంత తదితర వివరాలు తెలుసుకుందాం.

MG Comet Blackstorm Edition Highlights

ఎంజీ కామెట్ ఈవీ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్‌లో చాలా మార్పులు కనిపించవు. కానీ, బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ లోగో కొన్ని చోట్ల చూడచ్చు. కారు ఎక్స్‌టీరియర్ డిజైన్, ఇంటీరియర్‌లో రెడ్ కలర్ హైలైట్‌లు కనిపిస్తాయి. ఈ కారణంగా ఈ కారు మరింత స్పోర్టీగా కనిపిస్తుంది. కారు బ్లాక్ కలర్‌లో ఉంటుంది.

MG Comet Blackstorm Edition Price

ఎంజీ కామెట్ ఈవీ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ డిజైన్, బ్యాటరీ ప్యాక్‌లో ఎటువంటి మార్పు లేదు. ఈ కారులో 17.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ బ్యాటరీ 230 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. ధర విషయానికి వస్తే ఈ కారు ధర రూ. 7.80 లక్షలు + బ్యాటరీ రెంటల్ కూడా ఉంది. అయితే దీని సాధారణ మోడల్ ధర రూ. 4.99 లక్షలు + బ్యాటరీ రెంటల్.

MG Comet Blackstorm Edition Features

ఎంజీ కామెట్ ఈవీని GSEV ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారు చేశారు. కంపెనీ 55 కంటే ఎక్కువ కనెక్ట్ చేసిన కార్ ఫీచర్లు, 100 కంటే ఎక్కువ వాయిస్ కమాండ్‌ల వంటి ఫీచర్లను అందిస్తుంది. ఈ కారులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఉంది. అంతే కాకుండా ఈ కారుతో డిజిటల్ కీ అందుబాటులో ఉంది. ఈ కారులో కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ, డ్యూయల్-టోన్ ఇంటీరియర్, వాయిస్ కమాండ్, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories