Rare Earth Magnets : చైనాకు చెక్ పెట్టిన భారత్.. రేర్ ఎర్త్ మాగ్నెట్స్ లేకుండానే ఎలక్ట్రిక్ కార్లు

Rare Earth Magnets : చైనాకు చెక్ పెట్టిన భారత్.. రేర్ ఎర్త్ మాగ్నెట్స్ లేకుండానే ఎలక్ట్రిక్ కార్లు
x
Highlights

Rare Earth Magnets: చైనా ఇటీవల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్‌ల ఎగుమతులపై నిషేధం విధించి భారత్‌కు షాకిచ్చింది. దీని తర్వాత, ఆటో ఇండస్ట్రీలో 'ఇక కార్ల ఉత్పత్తి ఎలా జరుగుతుంది?' అనే చర్చ మొదలైంది. చైనా ఈ నిషేధం విధించినప్పటి నుంచి ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) ఉత్పత్తి కాస్త మందగించింది.

Rare Earth Magnets: చైనా ఇటీవల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్‌ల ఎగుమతులపై నిషేధం విధించి భారత్‌కు షాకిచ్చింది. దీని తర్వాత, ఆటో ఇండస్ట్రీలో 'ఇక కార్ల ఉత్పత్తి ఎలా జరుగుతుంది?' అనే చర్చ మొదలైంది. చైనా ఈ నిషేధం విధించినప్పటి నుంచి ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) ఉత్పత్తి కాస్త మందగించింది. అయితే, ఇప్పుడు భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొంది. కంపెనీలు ఇప్పుడు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్‌లు లేకుండానే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే పనిలో ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం 2026-27 నాటికి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ లేకుండా నడిచే ఈవీలను మార్కెట్‌లోకి తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు.

కంపెనీలు ఈ టెక్నాలజీ మీద చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నాయి. కాంపోనెంట్స్ తయారు చేసే స్టెర్లింగ్ టూల్స్ డైరెక్టర్ జయదీప్ వాధ్వా చెప్పిన దాని ప్రకారం, వారు గత 4-5 ఏళ్లుగా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ లేని మోటార్ల అప్లికేషన్లపై చాలా వాహన తయారీదారులతో కలిసి పని చేస్తున్నారు. ఇందులో కమర్షియల్ వాహనాలు, టూ వీలర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కాకుండా పెట్రోల్-డీజిల్ వాహనాలు కూడా ఉన్నాయి. చైనా ఎప్పుడూ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్‌లను తమకు అనుకూలంగా వాడుకుందని ఆయన అన్నారు. 2014లో చైనా, జపాన్ మధ్య జరిగిన భౌగోళిక రాజకీయ సంక్షోభం కారణంగా కూడా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్‌ల ధరలు ఏకంగా 3 రెట్లు పెరిగాయి.

దీనిపై అశోక్ లేల్యాండ్ ఈవీ డిపార్ట్ మెంట్ స్విచ్ మొబిలిటీ సీఈఓ మహేష్ బాబు మాట్లాడుతూ.. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా, అన్ని కంపెనీలు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్‌లకు ప్రత్యామ్నాయాలపై ఆలోచించాలని అన్నారు. కొన్ని సందర్భాల్లో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ లేని మోటార్లతో ఈవీలు 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి రావచ్చు. మరికొన్నింటికి ఎక్కువ సమయం పట్టవచ్చు అని ఆయన వివరించారు.

ఆర్థిక సంవత్సరంలో దేశంలో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్‌ల దిగుమతి 87 శాతం పెరిగిందని తెలుస్తోంది. అందులో 93 శాతం చైనా నుంచే వస్తుంది. 2024-25లో దేశంలో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్‌ల దిగుమతి గతేడాదితో పోలిస్తే 87 శాతం పెరిగి 53,700 టన్నులకు చేరుకుంది. ఆర్థిక సంవత్సరం 2023-24లో దేశంలో 28,700 టన్నుల రేర్ ఎర్త్ మ్యాగ్నెట్‌లు దిగుమతి అయ్యాయి. దేశంలో 93 శాతం రేర్ ఎర్త్ మ్యాగ్నెట్‌లు చైనా నుంచే దిగుమతి అయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2020-21లో కేవలం 12,400 టన్నుల రేర్ ఎర్త్ మ్యాగ్నెట్‌లు మాత్రమే దిగుమతి అయ్యాయి. ఈ గణాంకాలు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్‌లపై భారతదేశం చైనాపై ఎంతగా ఆధారపడి ఉందో చూపిస్తున్నాయి. అయితే, ఇప్పుడు స్వంతంగా ఈవీల ఉత్పత్తికి సిద్ధం కావడంతో భారత్ స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories