Hyundai Venue HX 5 Plus Launched: హ్యుందాయ్ క్రేజీ కారు లాంచ్.. ధర ఎంతో తెలుసా?

Hyundai Venue HX 5 Plus Launched
x

Hyundai Venue HX 5 Plus Launched: హ్యుందాయ్ క్రేజీ కారు లాంచ్.. ధర ఎంతో తెలుసా?

Highlights

Hyundai Venue HX 5 Plus Launched: కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ సరికొత్త కారును లాంచ్ చేసింది.

Hyundai Venue HX 5 Plus Launched: కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ సరికొత్త కారును లాంచ్ చేసింది. వెన్యూ HX5+ పేరుతో ఆవిష్కరించింది. వెన్యూ మిడ్ లెవల్ వేరియంట్ గా మార్కెట్ కు పరిచయం చేసింది. ఇవాళ (జనవరి 2, 2026న) ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ వేరియంట్ ధర రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది. HX5 కంటే రూ. 84,500 ఎక్కువ, HX6 కంటే రూ. 43,000 తక్కువ ధరను కలిగి ఉంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ తో మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

Venue HX 5 Plus ఇంజిన్, స్పెసిఫికేషన్లు

Venue HX 5 Plus 1.2 లీటర్ 4 సిలిండర్ కప్పా నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. పవర్83 PS @ 6000 rpm పవర్ ను కలిగి ఉంటుంది. 114 Nm @ 4200 rpm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంటుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్ టైప్ తో వస్తుంది. 5 సీటర్ కెపాసిటీని కలిగి ఉంటుంది. ఈ కారు మైలేజ్ లీటరుకు 18.05 నుంచి 18.5 కిలో మీటర్లు ఇస్తుంది. BS6 ఫేజ్ 2 ఇమిషన్ స్టాండర్డ్ ను కలిగి ఉంటుంది. 45 లీటర్ల ప్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. డ్రైవింగ్ రేంజ్ 812 కిలో మీటర్లు వస్తుంది. ఈ వేరియంట్ ను కంపెనీ HX5, HX6 మధ్య స్లాట్ చేసింది. పవర్‌ ట్రెయిన్ HX5తో సమానంగా ఉంది. కానీ, ఇందులో అదనపు ఫీచర్లు ఉన్నాయి.

HX5+ వేరియంట్ HX5 తో పోల్చితే కొన్ని అదనపు ఫీచర్లను అందిస్తుంది. ఎక్స్‌ టీరియర్ లో క్వాడ్ బీమ్ LED హెడ్‌ ల్యాంప్స్, రూఫ్ రైల్స్, రియర్ వైపర్, వాషర్ ఉంటుంది. ఇంటీరియర్ లో రియర్ విండో సన్‌ షేడ్, వైర్‌ లెస్ ఫోన్ చార్జర్, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌ రెస్ట్, డ్రైవర్ పవర్ విండో విత్ ఆటో అప్, డౌన్ ఫీచర్లను కలిగి ఉంటుంది. క్యారీ ఓవర్ ఫీచర్ల విషయానికి వస్తే, గ్రే క్యాబిన్ థీమ్, ఫాబ్రిక్ అప్‌ హోల్‌స్టరీ, 10.25 ఇంచుల ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌ లెస్ ఆపిల్ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 4 స్పీకర్ సౌండ్ సిస్టమ్, సింగిల్ పేన్ సన్‌ రూఫ్, మాన్యువల్ ACని కలిగి ఉంటుంది. అదనంగా డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్‌ మెంట్ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ కారులో 6 ఎయిర్‌ బ్యాగ్స్ ఉంటాయి. ABS విత్ EBD ఉంటుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజెస్, రియర్ పార్కింగ్ కెమెరా విత్ సెన్సార్స్ తో వస్తుంది. టాప్ వేరియెంట్లలో ADAS, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ లాంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉంటాయి. ఈ వేరియంట్ కన్వీనియెన్స్, సేఫ్టీని మెరుగుపరచడానికి రూపొందించబడిందని కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా డైలీ డ్రైవర్లకు బాగా సూటవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories