
మూడు నెలల్లోనే 80 వేల బుకింగ్స్..ఈ ఎస్‌యూవీకి అంత డిమాండ్ ఎందుకో తెలుసా?
Hyundai : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో హ్యుందాయ్ కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ వెన్యూ ఇప్పుడు రికార్డులు సృష్టిస్తోంది. సరికొత్త డిజైన్, అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన ఈ కారుకు కస్టమర్లు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం నవంబర్ 2025 నుంచి ఇప్పటివరకు అంటే అతి తక్కువ కాలంలోనే ఏకంగా 80,000 కి పైగా బుకింగ్స్ రావడం చూస్తుంటే ఈ కారు ఏ రేంజ్‌లో దూసుకుపోతుందో అర్థం చేసుకోవచ్చు. కేవలం రూ. 8 లక్షల ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ కారు, ప్రీమియం ఫీచర్లను తక్కువ ధరకే అందిస్తుండటంతో కస్టమర్లు షోరూమ్‌ల ముందు క్యూ కడుతున్నారు. హ్యుందాయ్ వెన్యూ ఇంతలా క్లిక్ అవ్వడానికి గల ఆ 5 ప్రధాన కారణాల గురించి తెలుసుకుందాం.
1. అదిరిపోయే డిజైన్.. అది కూడా కాంపాక్ట్ సైజులో!
మన ఊళ్లలో సందులు, పట్టణాల్లోని ట్రాఫిక్‌లో పెద్ద పెద్ద కార్లను నడపడం చాలా కష్టం. కానీ హ్యుందాయ్ వెన్యూ డిజైన్ ఈ సమస్యకు చెక్ పెడుతుంది. దీని కాంపాక్ట్ సైజ్ వల్ల సిటీ ట్రాఫిక్‌లో సులభంగా దూసుకుపోవచ్చు. పైగా కొత్త వెన్యూలో డార్క్ క్రోమ్ గ్రిల్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, స్టైలిష్ అలాయ్ వీల్స్ ఈ కారుకు ఒక విలాసవంతమైన లుక్ ఇస్తాయి. కారు చిన్నదైనా లోపల మాత్రం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
2. లగ్జరీ కార్ల రేంజ్‌లో ఫీచర్ల ఖజానా
వెన్యూ కారు లోపలికి వెళ్తే మనం ఏదో ఖరీదైన లగ్జరీ కారులో కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో 12.3 అంగుళాల భారీ డిజిటల్ స్క్రీన్, గాలి తగిలేలా ఉండే వెంట్ిలేటెడ్ సీట్లు, 8 స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కుటుంబంతో కలిసి లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఈ ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సరదాగా మారుస్తాయి.
3. అదిరిపోయే సేఫ్టీ.. లెవల్-2 ADAS టెక్నాలజీ
ఇప్పుడున్న రోజుల్లో కారు కొనేటప్పుడు ప్రతి ఒక్కరూ చూసేది సేఫ్టీ. వెన్యూ ఈ విషయంలో రాజీ పడలేదు. ఇందులో సెగ్మెంట్లోనే అత్యుత్తమమైన లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) టెక్నాలజీ ఉంది. ఇది హైవేలపై డ్రైవింగ్‌ను మరింత సురక్షితం చేస్తుంది. దీనికి తోడు బ్లూలింక్ కనెక్టెడ్ టెక్నాలజీ ద్వారా మనం మొబైల్ నుంచే కారును కంట్రోల్ చేయవచ్చు.
4. పవర్‌ఫుల్ ఇంజిన్.. అదిరిపోయే మైలేజీ
హ్యుందాయ్ వెన్యూ పెట్రోల్ మరియు డీజిల్.. ఇలా రెండు ఆప్షన్లలోనూ లభిస్తుంది. ముఖ్యంగా 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఇచ్చే పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో డ్రైవింగ్ చాలా స్మూత్‌గా సాగుతుంది. మైలేజీ విషయంలోనూ ఈ కారు కస్టమర్లను ఏమాత్రం నిరాశపరచదు.
5. సర్వీస్ నెట్‌వర్క్, రీసెల్ వాల్యూ
హ్యుందాయ్ బ్రాండ్‌పై భారతీయులకు ఉన్న నమ్మకం వెన్యూ విజయానికి పెద్ద ప్లస్ పాయింట్. దేశవ్యాప్తంగా ఉన్న విస్తృతమైన సర్వీస్ సెంటర్లు కారు మెయింటెనెన్స్‌ను సులభతరం చేస్తాయి. ఇక సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లోనూ ఈ కారుకు మంచి రీసెల్ వాల్యూ ఉండటం వల్ల ఇది ఒక లాభదాయకమైన పెట్టుబడిగా కస్టమర్లు భావిస్తున్నారు. అందుకే ఈ ఎస్‌యూవీ ఇప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




