Creta Flex Fuel: ఎస్‌యూవీకా బాప్.. ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో హ్యుందాయ్ క్రెటా

Creta Flex Fuel: ఎస్‌యూవీకా బాప్.. ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో హ్యుందాయ్ క్రెటా
x
Highlights

Creta Flex Fuel: హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్త క్రెటా ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కారును ఆటో ఎక్స్‌పో 2025లో మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ కారు ధర రూ. 17.99...

Creta Flex Fuel: హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్త క్రెటా ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కారును ఆటో ఎక్స్‌పో 2025లో మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ కారు ధర రూ. 17.99 లక్షలతో ప్రారంభమవుతుంది. దీనితో పాటు, హ్యుందాయ్ క్రెటా ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారును కూడా ఈ ఎక్స్‌పోలో పరిచయం చేసింది. గతంలో టాటా కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఎస్‌యూవీని పరిచయం చేసింది.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తరచుగా ఫ్లెక్స్ ఇంధనం గురించి మాట్లాడుతున్నారు. ఈ ఇంధనంతో నడిచే వాహనాలు కూడా ఆయనకు ఇష్టమైనవిగా చెబుతుంటారు. ఫ్లెక్స్ ఇంధనం పర్యావరణానికి సురక్షితంగా ఉండటమే కాకుండా ఆర్థికంగా కూడా ఉపయోగపడుతుందనేది నితిన్ గడ్కరీ అభిప్రాయం. భవిష్యత్తులో ఈ ఇంధనాన్ని వాహనాల్లో వినియోగించనున్నారు. ఈ నేపథ్యంలో క్రెటా ఫ్లెక్స్ ఫ్యూయల్‌ గురించి వివరంగా తెలుసుకుందాం.

హ్యుందాయ్ ఆటో ఎక్స్‌పో 2025 సందర్భంగా మిడ్-సైజ్ SUV క్రెటా ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌ను పరిచయం చేసింది. ఇది త్వరలో భారతదేశంలో విడుదల కావచ్చని భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. కంపెనీ దీని గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.

కొత్త క్రెటా ఫ్లెక్స్ ఫ్యూయల్‌లో ఒక లీటర్ (998cc) మూడు సిలిండర్లు, 12 వాల్వ్, టర్బో GDI ఇంజన్ ఉన్నాయి. ఇది 120 పీఎస్ పవర్, 172 న్యూటన్ మీటర్ల టార్క్ ఇస్తుంది. ఇందులో 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా ఉంది. ఈ ఇంజన్‌తో ఎస్‌యూవీని 100శాతం ఇథనాల్‌తో కూడా నడపవచ్చు. దీని మైలేజీకి సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. మెరుగైన బ్రేకింగ్ కోసం ఈ వాహనం అన్ని చక్రాలపై EBD, డిస్క్ బ్రేక్‌లతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది.

హ్యుందాయ్ క్రెటా ఫ్లెక్స్ ఫ్యూయల్ లాంచ్‌కు సంబంధించి ఇంకా నిర్దిష్ట సమాచారం అందలేదు, అయితే ఇది రాబోయే కొద్ది నెలల్లో భారతీయ మార్కెట్లోకి విడుదల చేయవచ్చని విశ్వసిస్తున్నారు. లాంచ్ సమయంలోనే ధర కూడా వెల్లడవుతుంది. క్రెటా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్‌ను మాత్రమే కంపెనీ మార్చింది. పొడవు, వెడల్పు, ఎత్తు, వీల్‌బేస్ మొదలైన వాటి పరంగా ఈ SUV పరిమాణంలో ఎటువంటి మార్పు లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories