
హ్యుందాయ్ అదిరిపోయే ఆఫర్..i10, i20 కార్లపై రూ.50,000 పైగా డిస్కౌంట్
Hyundai : కొత్త కారు కొనాలనుకునే వారికి హ్యుందాయ్ మోటార్స్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఫిబ్రవరి 2026 నెలకు సంబంధించి తన పాపులర్ కార్లపై భారీ డిస్కౌంట్లను అనౌన్స్ చేసింది. ముఖ్యంగా i10 నియోస్, i20, అల్కాజార్ మోడళ్లపై ఏకంగా రూ.50,000 కంటే ఎక్కువ తగ్గింపు లభిస్తోంది. హ్యుందాయ్ ఇండియా తన కస్టమర్ల కోసం ఈ ఫిబ్రవరి మాసాన్ని మరింత స్పెషల్‌గా మార్చేసింది. మార్కెట్లో గట్టి పోటీని ఎదుర్కొంటున్న నేపథ్యంలో తన మూడు ప్రధాన మోడళ్లపై అదిరిపోయే బెనిఫిట్స్ అందిస్తోంది. క్యాష్ డిస్కౌంట్తో పాటు స్క్రాపేజ్ బోనస్ వంటి రూపాల్లో ఈ ఆఫర్లను వర్తింపజేస్తోంది.
1. హ్యుందాయ్ i20, i20 N Line : ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో రారాజుగా వెలుగొందుతున్న i20 మోడళ్లపై కంపెనీ గరిష్టంగా రూ.58,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.30,000 నేరుగా క్యాష్ డిస్కౌంట్ కాగా, మరో రూ.25,000 స్క్రాపేజ్ బోనస్ రూపంలో లభిస్తుంది. అదనంగా రూ.3,000 ఇతర ఆఫర్లు ఉన్నాయి. మారుతి బాలెనో, టాటా ఆల్ట్రోజ్‌లకు గట్టి పోటీ ఇచ్చే ఈ కారు ధరలు ప్రస్తుతం ఎక్స్-షోరూమ్ వద్ద రూ.6.87 లక్షల నుంచి రూ.11.53 లక్షల మధ్య ఉన్నాయి.
2. హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ : సామాన్యుల ఫేవరెట్ కారు i10 నియోస్‌పై కూడా హ్యుందాయ్ ఏమాత్రం తగ్గకుండా రూ.58,000 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. i20 తరహాలోనే ఇందులో కూడా రూ.30,000 క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 స్క్రాపేజ్ బోనస్, రూ.3,000 అదనపు బెనిఫిట్స్ ఉన్నాయి. మారుతి స్విఫ్ట్, టాటా టియాగోలతో పోటీ పడే ఈ కారు, ఈ ఆఫర్లతో ప్రస్తుతం కస్టమర్లకు మరింత అందుబాటులోకి వచ్చింది. దీని ప్రారంభ ధర రూ.5.66 లక్షలుగా ఉంది.
3. హ్యుందాయ్ అల్కాజార్ : మూడు వరుసల సీట్లు కలిగిన లగ్జరీ ఎస్‌యూవీ అల్కాజార్ కొనేవారికి ఈ నెలలో రూ.55,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఇందులో రూ.20,000 నగదు తగ్గింపు ఉండగా, పాత కారును స్క్రాప్ చేస్తే లభించే బోనస్ కింద రూ.35,000 లభిస్తుంది. టాటా సఫారీ, మహీంద్రా XUV 7XO వంటి కార్లకు పోటీ ఇచ్చే అల్కాజార్ ధరలు రూ.14.50 లక్షల నుంచి రూ.21.06 లక్షల మధ్య ఉన్నాయి. పెట్రోల్, డీజిల్.. రెండు ఇంజిన్ ఆప్షన్లపై ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయి.
ఈ ఆఫర్లు కేవలం ఫిబ్రవరి నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. డీలర్ల వద్ద ఉన్న స్టాక్‌ను బట్టి ఈ డిస్కౌంట్లు మారుతుండవచ్చు, కాబట్టి కారు బుక్ చేసుకునే ముందు మీ దగ్గరలోని హ్యుందాయ్ షోరూమ్‌ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం ఉత్తమం.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




