Honda NX 200: 184సిసితో హోండా కొత్త బైక్.. ఫీచర్స్ భలే ఉన్నాయ్..!

Honda NX 200
x

Honda NX 200: 184సిసితో హోండా కొత్త బైక్.. ఫీచర్స్ భలే ఉన్నాయ్..!

Highlights

Honda NX 200: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్స్ హోండా NX 200ని విడుదల చేసింది.

Honda NX 200: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్స్ హోండా NX 200ని విడుదల చేసింది. ఈ బైక్ సరికొత్త డిజైన్, ఫీచర్లతో ఆకర్షణీయంగా ఉంటుంది. NX 200ని అడ్వెంచర్ సెగ్మెంట్‌లో లాంచ్ చేశారు. కొత్త బైక్ ధర రూ.1,68,499 ఎక్స్-షోరూమ్. హోండా NX 200 ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న HMSI రెడ్ వింగ్, బిగ్ వింగ్ డీలర్‌షిప్‌లలో కొనడానికి అందుబాటులో ఉంది.

హోండా NX 200 మోటార్‌సైకిల్ డీకాల్స్‌లో కొన్ని మార్పులు మినహా CB 200 X మాదిరిగానే డిజైన్‌ ఉంటుంది. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ బ్లింకర్స్, X-ఆకారపు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ ఉన్నాయి. అలాగే మస్క్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్, అగ్రెసివ్ గ్రాఫిక్స్ బైక్ లుక్‌‌ను పూర్తిగా మార్చేస్తాయి. బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో 4.2-అంగుళాల ఫుల్-డిజిటల్ TFT డిస్‌ప్లే, నావిగేషన్, కాల్ నోటిఫికేషన్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్స్ కోసం హోండా రోడ్‌లింక్ యాప్ సపోర్ట్ ఉంది.

అలానే ఛార్జింగ్ కోసం USB C-టైప్ ఛార్జింగ్ పోర్ట్ అందించారు. బైక్‌లో మెరుగైన బ్రేకింగ్ కోసం డ్యూయల్-ఛానల్ యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. బైక్‌లో 184.4 సిసి సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 12.5 కిలోవాట్ పవర్, 15.7 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories