Honda City Apex Edition Launched: మార్కెట్లోకి హోండా సిటీ అపెక్స్ ఎడిషన్.. ధర ఎంతంటే?

Honda City Apex Edition launched, its ex-showroom Prices start from Rs. 13.30 lakh and goes up to Rs. 15.62 lakh
x

Honda City Apex Edition Launched: మార్కెట్లోకి హోండా సిటీ అపెక్స్ ఎడిషన్.. ధర ఎంతంటే?

Highlights

Honda City Apex Edition Launched: భారతీయులకు ఇష్టమైన కార్ బ్రాండ్లలో హోండా ఒకటి. భారత్‌కు ఎన్నో ఐకానిక్ కార్లను అందించిన హోండా అమ్మకాలు ప్రస్తుతం...

Honda City Apex Edition Launched: భారతీయులకు ఇష్టమైన కార్ బ్రాండ్లలో హోండా ఒకటి. భారత్‌కు ఎన్నో ఐకానిక్ కార్లను అందించిన హోండా అమ్మకాలు ప్రస్తుతం ఆశాజనకంగా లేవని కంపెనీ పేర్కొంది. హోండా దేశంలో సిటీ, అమేజ్, ఎలివేట్ అనే మూడు కార్ మోడళ్లను విక్రయిస్తోంది. అయితే ఈ మోడల్స్ ఏవీ పెద్దగా సెక్సెస్ కాలేదు. ఈ కారణంగా అమ్మకాలను పెంచడానికి కంపెనీ నిరంతరం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా హోండా సిటీ అపెక్స్ ఎడిషన్‌ను విడుదల చేసింది.

హోండా సిటీ అపెక్స్ ఎడిషన్ V, VX వేరియంట్‌లో విడుదలైంది. ఈ కారును సాధారణ మోడల్ కంటే భిన్నగా చూపించడానికి ఫ్రంట్ ఫెండర్, టెయిల్‌గేట్‌పై స్పెషల్ 'అపెక్స్ ఎడిషన్' బ్యాడ్జ్‌ను డిజైన్ చేశారు. ఇంటీరియర్ మొత్తం గోధుమ కలర్‌లో కనిపిస్తుంది. సీట్ బ్యాక్‌రెస్ట్‌పై అపెక్స్ ఎడిషన్ ఎంబోస్ చేశారు. కుషన్‌లపై కూడా ఇలాంటి బ్రాండింగ్ ఉంది. అదనంగా, ఈ ఎడిషన్‌లో డాష్‌బోర్డ్, డోర్ ప్యాడ్‌లు, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై సాఫ్ట్-టచ్ ఫినిషింగ్, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్‌ ఉంది.

హోండా సిటీ అపెక్స్ ఎడిషన్ ఫీచర్లు, భద్రత దాని సాధారణ మోడల్ మాదిరిగానే ఉంటాయి. 8-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సింగిల్-పేన్ సన్‌రూఫ్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు చూడచ్చు. అంతేకాకుండా ఇందులోని సేఫ్టీ ఫీచర్లు కూడా ప్రస్తుతం ఉన్న సిటీ సెడాన్ లానే ఉన్నాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, అడాస్ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా ఇచ్చారు.

హోండా సిటీ అపెక్స్ ఎడిషన్ పవర్‌ట్రెయిన్ కూడా సాధారణ మోడల్‌తో సమానంగా ఉంటుంది. ప్రస్తుతం అమ్మకానికి అందుబాటులో ఉన్న హోండా సిటీ మాదిరిగానే, 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ ఉంది. ఈ ఇంజన్ 121 పిఎస్ పవర్, 145 న్యూటన్ మీటర్ టార్క్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. హోండా సిటీ అపెక్స్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.30 లక్షల నుంచి మొదలై, రూ. 15.62 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories