Honda City Price Hiked: ధరల షాక్.. హోండా సిటీ, అమేజ్ ధరలు పెరుగుతున్నాయ్!

Honda City and Honda Amaze Prices Hiked
x

Honda City Price Hiked: ధరల షాక్.. హోండా సిటీ, అమేజ్ ధరలు పెరుగుతున్నాయ్!

Highlights

Honda City Price Hiked: దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థల్లో ఒకటైన హోండా సెడాన్ కార్ సిటీ ధర పెంచుతున్నట్లు వెల్లడించింది.

Honda City Price Hiked: దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థల్లో ఒకటైన హోండా సెడాన్ కార్ సిటీ ధర పెంచుతున్నట్లు వెల్లడించింది. హోండా సిటీ SV MT, V MT, VX MT, VX CVT, ZX MT, ZX CVT వేరియంట్ల ధరలు పెరగనున్నాయి. ఇప్పుడు ఈ కార్లను కొనాలంటే రూ.20,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే హోండా సిటీ హైబ్రిడ్ e:HEV మోడల్ ధరలో ఎటువంటి మార్పులేదు. ఈ నెల ప్రారంభంలో ఎలివేట్ ధరను రూ. 20,000 పెంచింది.

హోండా సిటీలో 1.5-లీటర్ iVTEC పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్, సీవీటీ గేర్‌బాక్స్‌తో వస్తుంది. సిటీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.82 లక్షల నుండి రూ. 16.63 లక్షల వరకు ఉంది. కారులో 4.2-అంగుళాల కలర్ టీఎఫ్‌టీ డ్రైవర్ డిస్‌ప్లే, 8-స్పీకర్ ప్రీమియం సరౌండ్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కనిపిస్తాయి.

సేఫ్టీ విషయానికి వస్తే కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, లేన్ వాచ్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటో-డిమ్మింగ్ ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్ , రెయిన్ సెన్సింగ్ ఉన్నాయి. అంతేకాకుండా వైపర్లు, వెనుక విండ్‌షీల్డ్ డెమిస్టర్ వంటి ఫీచర్లు ఈ కారులో చూడవచ్చు.

Honda City Facelift

ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం హోండా గత సంవత్సరం బ్రెజిల్‌లో కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ఆవిష్కరించింది. కంపెనీ ఈ కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. కొన్ని ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ మార్పులతో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేస్తారని నిపుణులు భావిస్తున్నారు.

Honda Amaze Price Hiked

హోండా ఇటీవల అమేజ్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త హోండా అమేజ్ ధర ఫిబ్రవరి 1 నుంచి పెరగనుంది. అయితే ఎంత పెరుగుతుందనేది ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం అమేజ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.99 లక్షల నుండి రూ.9.69 లక్షల వరకు ఉంది. కొత్త అమేజ్ 10 సంవత్సరాల వరకు వారంటీతో వస్తుంది. మీరు ఈ కారును ప్రస్తుత ధరలో జనవరి 31 వరకు కొనచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories