Honda and Nissan merger: హోండా, నిసాన్ విలీనం ఎందుకంటే...

Honda and Nissan merger: హోండా, నిసాన్ విలీనం ఎందుకంటే...
x
Highlights

Honda and Nissan merger News: జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థలు హోండా మోటార్, నిస్సాన్ మోటార్ త్వరలో విలీనం కానున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు...

Honda and Nissan merger News: జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థలు హోండా మోటార్, నిస్సాన్ మోటార్ త్వరలో విలీనం కానున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రెండు సంస్థలు చర్చలు జరిపినట్లు ఇంగ్లీష్ మీడియాలో వార్తలొస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో పెరుగుతున్న పోటీని ఎదుర్కొనేందుకు ఈ విలీనానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో బుధవారం ట్రేడింగ్ సెషన్‌లో నిస్సాన్ షేర్లు 24 శాతం మేర పెరిగి ఇంట్రాడేలో సరికొత్త రికార్డును నమోదు చేశాయి.

ఈ రెండు సంస్థల మధ్య చర్చలు జరిగినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో హోండా సంస్థ విలీనం, మూలధన వ్యయం వంటి అనేక అంశాలను పరిశీలిస్తున్నట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షింజీ అయోమా తెలిపారు. కానీ పూర్తి వివరాలను అందించడానికి ఆయన నిరాకరించినట్లు తెలుస్తోంది.

ఒకవేళ విలీనం జరిగితే హోండా, నిస్సాన్ సంయుక్తంగా ప్రతి ఏడాది 74 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యానికి తీసుకెళ్లనున్నాయి. దీంతో టయోటా, వోక్స్‌వ్యాగన్ తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటోమొబైల్ గ్రూప్‌గా అవతరించనుంది. ఇదిలా ఉంటే ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కోసం ఈ ఏడాది మార్చి నెలలోనే ఇరు సంస్థలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories