Hero: బైక్ కొనండి.. రూ.40వేలు ఆదా చేసుకోండి.. హీరో సరికొత్త ప్లాన్ అదుర్స్

Hero
x

Hero: బైక్ కొనండి.. రూ.40వేలు ఆదా చేసుకోండి.. హీరో సరికొత్త ప్లాన్ అదుర్స్

Highlights

Hero: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్నారా? ధర ఎక్కువగా ఉందని వెనకడుగు వేస్తున్నారా? అయితే గుడ్ న్యూస్.. హీరో మోటోకార్ప్ ఒక అదిరిపోయే ఆఫర్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వీడా వీఎక్స్2ను మార్కెట్‌లోకి తెచ్చింది.

Hero: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్నారా? ధర ఎక్కువగా ఉందని వెనకడుగు వేస్తున్నారా? అయితే గుడ్ న్యూస్.. హీరో మోటోకార్ప్ ఒక అదిరిపోయే ఆఫర్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వీడా వీఎక్స్2ను మార్కెట్‌లోకి తెచ్చింది. ఈ స్కూటర్ 'బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్' అనే కొత్త మోడల్‌తో వచ్చింది. దీని ఉద్దేశ్యం ఏంటంటే ఎలక్ట్రిక్ స్కూటర్లను సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావడం. ఈ BaaS మోడల్ వల్ల స్కూటర్ కొనేటప్పుడు బ్యాటరీకి డబ్బులు కట్టాల్సిన పనిలేదు. బదులుగా, మీరు ప్రతి కిలోమీటర్‌కు బ్యాటరీని అద్దెకు తీసుకున్నట్లు డబ్బు కడితే సరిపోతుంది. దీనివల్ల స్కూటర్ మొదటి ధర చాలా తగ్గిపోతుంది.

వీడా వీఎక్స్2 రెండు వేరియంట్లలో వస్తుంది. BaaS మోడల్‌లో స్కూటర్‌ను కేవలం రూ.59,490కే కొనవచ్చు. అదే బ్యాటరీతో సహా కొనాలంటే రూ.99,490 అవుతుంది. అంటే, BaaS మోడల్ వల్ల దాదాపు రూ.40,000 తేడా వస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ మొదటిసారి కొనేవాళ్లకు లేదా రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వాళ్లకు ఈ రూ.40,000 ఆదా చాలా పెద్ద ప్రయోజనం.

మార్కెట్ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. ఈ BaaS మోడల్ హీరోను ఈవీ మార్కెట్‌లో మరింత ముందుకు తీసుకెళ్తుంది. హీరో తీసుకున్న ఈ BaaS ప్లాన్, ఎంజీ మోటార్స్ కంపెనీని చూసి స్ఫూర్తి పొందింది. ఎంజీ మోటార్స్ కూడా BaaS మోడల్‌ను వాడిన తర్వాత కేవలం మూడు నెలల్లోనే తమ ఈవీ మార్కెట్ వాటాను 16.5% నుంచి 41%కి పెంచుకుంది. అంతేకాకుండా, హీరో కంపెనీ దేశవ్యాప్తంగా 3,600కు పైగా ఛార్జింగ్ స్టేషన్లను, 500కు పైగా సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. దీనివల్ల కస్టమర్లకు మెరుగైన సేవలు అందుతాయి.

BaaS మోడల్ మొదట్లో బాగా పాపులర్ అయినా, దీర్ఘకాలంలో అందరికీ ఇది అంత చవక కాకపోవచ్చు అని నిపుణులు అంటున్నారు. రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వాళ్లకు, కాలక్రమేణా మొత్తం ఖర్చు ఎక్కువ అవ్వొచ్చు అని వాళ్లు చెబుతున్నారు. అయితే, హీరో తీసుకొచ్చిన ఈ BaaS మోడల్ సక్సెస్ అయితే, మిగతా కంపెనీలు కూడా ఇలాంటి ఆఫర్లను తీసుకురావచ్చు. అప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో ఒక కొత్త మార్పు వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories