Harley Davidson Fat Boy Gray Ghost: వామ్మో.. 22 లక్షల రూపాయల బైకా.. హార్లీ డేవిడ్‌సన్ కొత్త మోడల్ చూస్తే దిమ్మతిరుగుద్ది..!

Harley Davidson Fat Boy Gray Ghost: వామ్మో.. 22 లక్షల రూపాయల బైకా.. హార్లీ డేవిడ్‌సన్ కొత్త మోడల్ చూస్తే దిమ్మతిరుగుద్ది..!
x

Harley Davidson Fat Boy Gray Ghost: వామ్మో.. 22 లక్షల రూపాయల బైకా.. హార్లీ డేవిడ్‌సన్ కొత్త మోడల్ చూస్తే దిమ్మతిరుగుద్ది..!

Highlights

1990 మోడల్ జ్ఞాపకార్థం హార్లే-డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ గ్రే ఘోస్ట్ ఎడిషన్ 1,990 యూనిట్లు మాత్రమే తయారు చేశారు.

Harley Davidson Fat Boy Gray Ghost: హార్లే-డేవిడ్సన్ తన ఐకానిక్ క్రూయిజర్ బైక్ ఫ్యాట్ బాయ్ కొత్త 2025 గ్రే ఘోస్ట్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. ఈ లిమిటెబ్ ఎడిషన్ మోడల్ 1990 నాటి ఒరిజినల్ ఫ్యాట్ బాయ్‌కి గుర్తుగా తీసుకొస్తున్నారు - టెర్మినేటర్ 2: జడ్జిమెంట్ డేలో కనిపించిన అదే బైక్, ఇప్పటికీ మోటార్ సైకిల్ ప్రపంచంలో ఒక క్లాసిక్‌గా పరిగణిస్తున్నారు.

1990 మోడల్ జ్ఞాపకార్థం హార్లే-డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ గ్రే ఘోస్ట్ ఎడిషన్ 1,990 యూనిట్లు మాత్రమే తయారు చేశారు. ఇది హార్లే-డేవిడ్సన్ ఐకాన్స్ మోటార్ సైకిల్ కలెక్షన్‌లో భాగం, ఇది క్లాసిక్ డిజైన్‌ను ఆధునిక సాంకేతికతతో మిళితం చేస్తుంది. ఈ బైక్‌పై ఒక ప్రత్యేక నంబర్‌తో కూడిన ట్యాంక్ బ్యాడ్జ్ ఉంటుంది, ఇది ప్రతి యూనిట్‌ను ప్రత్యేకంగా చేస్తుంది.

Gray Finish

ఈ బైక్‌కు సాంప్రదాయ క్రోమ్ కంటే ఎక్కువగా మెరిసే అల్ట్రా-పాలిష్డ్ మిర్రర్ లాంటి లుక్ ఇచ్చారు. ఈ లుక్ PVD (ఫిజికల్ వేపర్ డిపాజిషన్) టెక్నాలజీని ఉపయోగించి రూపొందించారు. ఇది మరింత మన్నికైనదిగా, తుప్పు పట్టకుండా చేస్తుంది.

Yellow accents

ఇంజిన్, ట్యాంక్ కన్సోల్, ట్రిమ్‌లు లేత పసుపు రంగులో ఉంటాయి, ఇది అసలు 1990 మోడల్ స్టైలింగ్‌ను ప్రతిబింబిస్తుంది. క్లాసిక్ చంకీ డిస్క్ వీల్స్, రౌండ్ ఎయిర్ క్లీనర్, సిగ్నేచర్ ఫ్యాట్ బాయ్ స్టాన్స్ దీనికి రెట్రో-మోడరన్ లుక్‌‌ని ఇస్తాయి.

Harley Davidson Fat Boy Gray Ghost Engine And Performance

హార్లే-డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ గ్రే ఘోస్ట్ ఎడిషన్‌లో 1,923సీసీ V-ట్విన్ మోటారు ఉంటుంది. ఈ ఇంజిన్ 4,800ఆర్‌పిఎమ్ వద్ద 101హెచ్‌పి పవర్, 3,000ఆర్‌పిఎమ్ వద్ద 166ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. గ్రే ఘోస్ట్ ప్రామాణిక ఫ్యాట్ బాయ్ నుండి సాఫ్టైల్ ఛాసిస్‌ను నిలుపుకుంది. షోవా ఫ్రంట్ ఫోర్కులు, వెనుక భాగంలో మోనోషాక్ ఉన్నాయి. సీటు ఎత్తు 655మి.మీగా ఉంది. ఈ బైక్‌లో విశాలమైన హ్యాండిల్‌బార్లు, ముందు భాగంలో అమర్చచిన ఫుట్ కంట్రోల్‌లు ఉన్నాయి. దీనికి చుట్టూ ఎల్ఈడీ లైటింగ్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఇగ్నిషన్ కూడా లభిస్తాయి.

Harley Davidson Fat Boy Gray Ghost Price

USలో ఈ మోటార్ సైకిల్ ధర $25,399 (సుమారు రూ. 21.5 లక్షలు). భారతదేశానికి ఇంకా అధికారిక ప్రకటన లేనప్పటికీ, కొన్ని యూనిట్లు CBU (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) ద్వారా భారతదేశానికి దిగుమతి అయ్యే అవకాశం ఉంది. టెర్మినేటర్ 2 నుండి ప్రసిద్ధి చెందిన ఈ బైక్ మరోసారి అభిమానుల హృదయాలను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories