Maruti Suzuki: కొత్త కారు కొంటున్నారా.. ఈ కారుపై ఏకంగా రూ. 49,000 డిస్కౌంట్..!

Good News for New Car Buyers Maruti Suzuki Wagon R at Rs.49,000 Discount is Available
x

Maruti Suzuki: కొత్త కారు కొంటున్నారా.. ఈ కారుపై ఏకంగా రూ. 49,000 డిస్కౌంట్..!

Highlights

Maruti Suzuki: కొత్త కారు కొనాలనుకునేవారికి ఇది శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే మారుతి సుజుకీ కంపెనీ గొప్ప డిస్కౌంట్‌ను అందిస్తోంది.

Maruti Suzuki: కొత్త కారు కొనాలనుకునేవారికి ఇది శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే మారుతి సుజుకీ కంపెనీ గొప్ప డిస్కౌంట్‌ను అందిస్తోంది. తక్కువ బడ్జెట్లో కారు కొనాలనుకునేవారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పాలి. మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్ కారుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందుకే మన దేశంలో బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలుస్తోంది. ఈ కారును వినియోగదారులకు మరింత దగ్గర చేసేందుకు కంపెనీ స్పెసల్‌ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా రూ. 49,000 వరకూ డిస్కౌంట్ అందిస్తోంది. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

2023, అక్టోబర్ అత్యధికంగా అమ్ముడైన కారు మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్. వాస్తవానికి కొన్ని నెలలుగా దీని కొనుగోళ్ల వృద్ధి రేటు పెరుగూతూ వస్తోంది. ప్రస్తుతం అన్ని కార్ల కంపెనీలు పండుగ సీజన్‌లో భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. ఇందులో భాగంగా నగదు తగ్గింపులు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు, కార్పొరేట్ ప్రయోజనాలు ఉంటాయి. నవంబర్ చివరి వరకూ వినియోగదారులకు అందుబాటులో ఉండే ఆఫర్ల గురించి చూస్తే.. మారుతి సుజుకి రూ.25,000 నగదు తగ్గింపుతో పాటు రూ.20,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ.4,000 కార్పొరేట్ తగ్గింపును అందిస్తోంది. మొత్తం ప్రయోజనాలు కలిపి రూ.49,000 వరకూ ఉంటాయి.

మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తోంది. ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్. వీటిల్లో ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ ట్రిమ్స్ సీఎన్జీ వెర్షన్లోకూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు రూ.5.54లక్షల నుంచి రూ.7.42 లక్షల వరకూ ఉంటుంది. ఇందులో 1 లీటర్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 5స్పీడ్ ఏఎంటీ టెక్నాలజీతో పాటు మాన్యువల్ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories