Upcoming Bikes: బైక్ లవర్స్‌కు పండగే.. థ్రిల్లింగ్ రైడ్ ఇచ్చే కొత్త బైక్స్ వచ్చేస్తున్నాయి..!

Upcoming Bikes: బైక్ లవర్స్‌కు పండగే.. థ్రిల్లింగ్ రైడ్ ఇచ్చే కొత్త బైక్స్ వచ్చేస్తున్నాయి..!
x
Highlights

Upcoming Bikes: ఈ నెలలో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి టీవీఎస్ మోటార్స్ వరకు తమ కొత్త బైక్‌లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

Upcoming Bikes: ఈ నెలలో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి టీవీఎస్ మోటార్స్ వరకు తమ కొత్త బైక్‌లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాల కంపెనీలు తమ అమ్మకాలను పెంచుకునేందుకు కొత్త మోడళ్లను విడుదల చేయబోతున్నాయి. మీరు కూడా కొత్త బైక్‌ కొనాలని చూస్తుంటే.. ఏ బైక్ మోడల్స్ లాంచ్ అవుతున్నాయి? వాటిలో ఎటువంటి ఫీచర్స్ ఉంటాయి? తదితర వివరాలు తెలుసుకుందాం.

Royal Enfield Classic 650

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650‌ని గత సంవత్సరం EICMA 2024లో ప్రవేశపెట్టారు. ఈ బైక్ డిజైన్ క్లాసిక్ 350ని పోలి ఉంటుంది. ఇతర 650cc రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ మాదిరిగానే 647.95cc, ఎయిర్, ఆయిల్-కూల్డ్, సమాంతర ట్విన్ ఇంజన్‌ని చూడవచ్చు, ఇంజన్ 47.6పిఎస్ పవర్, 52.3Nm టార్క్ ఇస్తుంది. ఈ ఎన్ఫీల్డ్ బైక్‌ను బ్లాక్ క్రోమ్, బ్రంటింగ్‌థోర్ప్ బ్లూ, వల్లమ్ రెడ్, టీల్ అనే నాలుగు విభిన్న డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌లలో విడుదల చేయనున్నారు.

TVS Apache RTX 300

టీవీఎస్ మోటార్ కంపెనీ భారతదేశంలో తన మొదటి అడ్వెంచర్ బైక్‌ను మార్చి నెలలో విడుదల చేయనుంది. బైక్ TVS Apache RTX 300 పేరుతో మార్కెట్లోకి వస్తుంది. ఈ రాబోయే అడ్వెంచర్ బైక్ జనవరి 2025లో ఆటో ఎక్స్‌పోలో పరిచయం చేశారు. బైక్ టెస్టింగ్ టెస్టింగ్ సమయంలో కూడా చాలా సార్లు కనిపించింది. ఇందులో టీవీఎస్ కొత్త RT-XD4 ఇంజన్‌ ఉంటుంది.

Hero Karizma XMR 250

హీరో మోటోకార్ప్ తన కొత్త స్పోర్ట్స్ బైక్‌ను ఈ నెలలో విడుదల చేయనుంది. ఈ సంవత్సరం జనవరి 2025లో, కంపెనీ కరిజ్మా XMR 250ని ఆటో ఎక్స్‌పోలో పరిచయం చేసింది. బైక్ డిజైన్ కరిజ్మా XMR మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో గ్రాఫిక్స్ కాస్త భిన్నంగా ఉండొచ్చు. ఈ బైక్‌లో 250cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 30 పిఎస్ పవర్, 25 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బైక్ ధర రూ.2 లక్షల లోపే ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories