Best Selling Scooter: స్కూటర్ కొనాలనుకుంటున్నారా? దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ఈ ఐదింటిపై ఓ లుక్ వేయండి..!

From Honda Activa to tvs Jupiter and Suzuki access these top selling Scooter in India
x

Best Selling Scooter: స్కూటర్ కొనాలనుకుంటున్నారా? దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ఈ ఐదింటిపై ఓ లుక్ వేయండి..!

Highlights

Best Selling Scooter In India: దేశంలో ఏ స్కూటర్‌లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారో మీకు తెలిస్తే.. ఎలాంటి స్కూటర్‌ను ఎంచుకోవడంలో బాగా సహాయపడుతుంది.

Best Selling Scooter In India: మీరు స్కూటర్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా.. లేదా ఏ స్కూటర్‌ని కొనుగోలు చేయాలో నిర్ణయించుకోలేకపోతున్నారా.. అయితే, మీకోసమే ఈ కథనం. ఖచ్చితంగా మీకు కొంచెం సహాయం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 5 స్కూటర్ల గురించి చెప్పబోతున్నాం. జులై 2023లో అమ్ముడైన టాప్-5 స్కూటర్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. హోండా యాక్టివ్..

హోండా యాక్టివా భారతదేశంలో స్కూటర్ సెగ్మెంట్‌ను శాసిస్తూనే ఉంది. జపాన్ బ్రాండ్ ఈ ఏడాది జులైలో 1,35,327 యూనిట్ల యాక్టివాను విక్రయించింది. ఇది గత ఏడాది (2022) జులైతో పోలిస్తే 37% తక్కువ. Activa 110cc అలాగే 125cc వెర్షన్లలో వస్తుంది.

2. TVS జూపిటర్..

TVS జూపిటర్ జులై 2023లో 66,439 యూనిట్లను విక్రయించి రెండవ స్థానంలో కొనసాగుతోంది. గత ఏడాది (జులై 2022) ఇదే కాలంలో 62,094 యూనిట్లు జూపిటర్ అమ్ముడయ్యాయి. అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 7% వృద్ధిని నమోదు చేశాయి. జూపిటర్ 110సీసీ, 125సీసీ వెర్షన్లలో కూడా అందుబాటులో ఉంది.

3. సుజుకి యాక్సెస్..

జులై (2023)లో సుజుకి 51,678 యూనిట్ల యాక్సెస్‌ను విక్రయించింది. వాల్యూమ్‌లలో సంవత్సరానికి 25% వృద్ధిని నమోదు చేసింది. జులై 2022లో, జపాన్ బ్రాండ్ దేశంలో 41,440 యూనిట్ల యాక్సెస్‌ను విక్రయించింది.

4. TVS Ntorq..

TVS Ntorq జులై 2023లో 25,839 యూనిట్ల విక్రయాలతో నాల్గవ స్థానాన్ని పొందింది. ఈ స్పోర్టీ లుకింగ్ స్కూటర్ గతేడాది జులైలో 24,367 యూనిట్లను విక్రయించింది. అంటే, వార్షిక ప్రాతిపదికన 6% పెరుగుదల ఉంది.

5. హోండా డియో..

హోండా డియో విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 43.65% క్షీణతను నమోదు చేశాయి. ఇది జులై 2023లో 20,414 యూనిట్లను విక్రయించింది. అత్యధికంగా అమ్ముడైన ఐదవ స్కూటర్‌గా నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories