Cheap And Best Cars: ఫస్ట్ టైమ్ కారు కొంటున్నారా ? టెన్షన్ వద్దు.. ఇదిగో సరైన లిస్ట్..!

First Time Buying Compact SUV the Best Cheap and Best Cars
x

Cheap And Best Cars: ఫస్ట్ టైమ్ కారు కొంటున్నారా ? టెన్షన్ వద్దు.. ఇదిగో సరైన లిస్ట్..!

Highlights

Cheap And Best Cars: సొంతంగా కారు కొనుక్కోవాలనేది ప్రతి ఒక్కరి కల. కారు కొనడానికి రూపాయి రూపాయి కుడబెట్టుకుని ప్లాన్ చేసుకునే వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు.

Cheap And Best Cars: సొంతంగా కారు కొనుక్కోవాలనేది ప్రతి ఒక్కరి కల. కారు కొనడానికి రూపాయి రూపాయి కుడబెట్టుకుని ప్లాన్ చేసుకునే వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కారు కొనేముందు కాస్త జాగ్రత్త వహించండి. ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ కొనే ప్రయత్నం చేయండి. ఈ సెగ్మెంట్‌లో అనేక కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఉన్నాయి. ఇవి మీ డబ్బుకు విలువైనవిగా నిరూపిస్తాయి. ఇది మాత్రమే కాదు.. వాటి ధర రూ. 5.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Nissan Magnite

నిస్సాన్ మాగ్నైట్ ఒక ఎంట్రీ-లెవల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. దీని ధర రూ. 6.14 లక్షల నుండి ప్రారంభమవుతుంది. దీని డిజైన్ ఆకట్టుకుంటుంది. దీనిలో మంచి స్థలం ఉంది. 5 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. మాగ్నైట్ రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది, వీటిలో 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్, 1.0L నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. ఈ ఇంజన్లు 6-స్పీడ్ MT లేదా CVT గేర్‌బాక్స్‌కి జతచేసి ఉంటాయి. కొత్త మాగ్నైట్ మీకు 20కెఎమ్‌పిఎల్ వరకు మైలేజీని అందిస్తుంది. భద్రత కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. దీనికి భద్రత పరంగా 4 స్టార్ రేటింగ్ లభించింది.

Hyundai Exter

హ్యుందాయ్ చౌకైన కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌టర్ కూడా మీకు మంచి ఎంపికగా ఉంటుంది. డిజైన్ పరంగా ఇది ఆకట్టుకోలేదు కానీ దాని ఇంటీరియర్ బాగుంది. దీనిలో కూడా మీకు మంచి స్థలం లభిస్తుంది. ఇందులో 5 మంది కూర్చునే స్థలం ఉంది. ఎక్స్‌టర్ 1.2-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 83పిఎస్ పవర్, 114ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లభిస్తుంది. ఈ కారు లీటరుకు 19 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. భద్రత కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌‌తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. దీనికి భద్రత పరంగా 4 స్టార్ రేటింగ్ లభించింది. ఈ కారు ధర రూ.5.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Tata Punch

టాటా పంచ్ దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఈ కారు ధర రూ.6.13 లక్షల నుండి ప్రారంభమవుతుంది. పంచ్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 86పిఎస్ పవర్, 113ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. ఈ కారు లీటరు ఇంధనానికి 19 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. భద్రత కోసం ఇందులో 2 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌‌‌తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. పంచ్ దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీ.

Show Full Article
Print Article
Next Story
More Stories