FASTag Rule Change : వాహనదారులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ఫాస్టాగ్ కొత్త రూల్స్..ఆ తలనొప్పి ఇక ఉండదు

వాహనదారులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ఫాస్టాగ్ కొత్త రూల్స్..ఆ తలనొప్పి ఇక ఉండదు

CR Reddy
Published on: 1 Feb 2026 12:55 PM IST
FASTag Rule Change : వాహనదారులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ఫాస్టాగ్ కొత్త రూల్స్..ఆ తలనొప్పి ఇక ఉండదు
X

FASTag Rule Change : ఫిబ్రవరి నెల రాకతోనే వాహనదారులకు ఒక తీపి కబురు అందింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ నియమాల్లో భారీ మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుండి అంటే ఫిబ్రవరి 1, 2026 నుంచి ఫాస్టాగ్ వినియోగదారులు పదే పదే కేవైసీ వెరిఫికేషన్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ కొత్త నిబంధన వల్ల లక్షలాది మంది వాహనదారులకు ఊరట లభించనుంది.

నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. ఫాస్టాగ్ వినియోగదారులు ఇకపై పదే పదే నో యువర్ వెహికల్ లేదా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం లేదు. గతంలో ఫాస్టాగ్ తీసుకున్న తర్వాత కూడా కాలానుగుణంగా వెరిఫికేషన్ చేయించుకోకపోతే ఖాతాలు బ్లాక్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ బాధ్యతను ఎన్‌హెచ్‌ఏఐ పూర్తిగా ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకులకు అప్పగించింది. ఫాస్టాగ్ జారీ చేసే ముందే బ్యాంకులు వాహనం, యజమాని వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఫాస్టాగ్ యాక్టివేట్ అయిన తర్వాత, సాధారణ పరిస్థితుల్లో మళ్లీ కేవైసీ చేయాల్సిన పని లేదు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది వాహనదారులకు సమయం ఆదా అవుతుంది. ముఖ్యంగా సరైన పత్రాలు ఉన్నప్పటికీ కేవైసీ ప్రక్రియలో జాప్యం కారణంగా ఫాస్టాగ్ పనిచేయక టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఇది పెద్ద ఊరట. ఇకపై కొత్త ఫాస్టాగ్ జారీ చేసే సమయంలోనే బ్యాంకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాయి కాబట్టి, కస్టమర్ల మీద అదనపు భారం ఉండదు. కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే, అంటే ఫాస్టాగ్ దుర్వినియోగం జరిగినట్లు ఫిర్యాదులు వస్తే లేదా ఫాస్టాగ్ సరిగ్గా అతికించనట్లు గుర్తిస్తే తప్ప, సాధారణ వాహనదారులకు మళ్లీ వెరిఫికేషన్ అవసరం ఉండదు.

ప్రస్తుతం వాడుకలో ఉన్న ఫాస్టాగ్‌లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. అంటే పాత ఫాస్టాగ్ ఉన్నవారు కూడా ఫిర్యాదులు లేనంత వరకు మళ్లీ కేవైసీ అప్‌డేట్ చేయనక్కర్లేదు. ప్రభుత్వ నివేదికల ప్రకారం, ఈ సంస్కరణ ద్వారా టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడంతో పాటు డిజిటల్ పేమెంట్లను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవైపు బడ్జెట్ హడావుడి సాగుతుండగానే, వాహనదారులకు ఇలాంటి వెసులుబాటు కల్పించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఫాస్టాగ్ టెక్నాలజీని మరింత పారదర్శకంగా మార్చే దిశగా ఇది ఒక పెద్ద అడుగు.

CR Reddy

CR Reddy

Next Story