Gen Z Auto Expo 2025: సాయి ధరమ్ తేజ్ చేతులమీదుగా ప్రారంభమైన జెన్ Z ఆటో ఎక్స్‌పో 2025!

సాయి ధరమ్ తేజ్ చేతులమీదుగా ప్రారంభమైన జెన్ Z ఆటో ఎక్స్‌పో 2025!
x

సాయి ధరమ్ తేజ్ చేతులమీదుగా ప్రారంభమైన జెన్ Z ఆటో ఎక్స్‌పో 2025!

Highlights

"ఫాస్ట్ & క్యూరియస్ – ది ఆటో ఎక్స్‌పో 2025” ను స్టూడెంట్ ట్రైబ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని టి-హబ్ వద్ద ఘనంగా నిర్వహించారు.

"ఫాస్ట్ & క్యూరియస్ – ది ఆటో ఎక్స్‌పో 2025” ను స్టూడెంట్ ట్రైబ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని టి-హబ్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టాలీవుడ్ యంగ్ హీరో సుప్రీమ్ స్టార్ సాయి ధర్‌మ్ తేజ్ ప్రారంభించారు. జెన్‌జడ్ తరానికి ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఆటో ఎక్స్‌పో, కార్లు, సాంకేతికత, సినిమా ప్రపంచం. ఈ మూడింటి కలయికను ప్రతిబింబిస్తూ యువతలో సృజనాత్మకతను, ఆసక్తిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

స్టూడెంట్ ట్రైబ్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ శ్రీ చరణ్ లక్కరాజు మాట్లాడుతూ,

“ఆటో ఎక్స్‌పో విద్యార్థులకు ఆటోమొబైల్ ఇండస్ట్రీలోని కెరీర్ అవకాశాలపై ప్రత్యక్ష అనుభవాన్ని అందించే అద్భుతమైన వేదిక. విద్యార్థులు నిపుణులతో నేరుగా మాట్లాడి, పరిశ్రమ ధోరణులను అర్థం చేసుకొని, తమ నైపుణ్యాలను ఎక్కడ ఉపయోగించుకోవచ్చో తెలుసుకోవడం చాలా గొప్ప విషయమ”ని అన్నారు.

ఈ ఎక్స్‌పోలో తెలంగాణ రాష్ట్రంలోని 100కు పైగా కాలేజీల నుండి 2,000కి పైగా విద్యార్థులు పాల్గొని, ఆటోమొబైల్ ప్రపంచాన్ని అన్వేషించే అపూర్వ అవకాశాన్ని పొందారు.

జెనెక్స్ అమర్ మీడియాతో మాట్లాడుతూ,

“ఈ ప్రదర్శనలో ఆవిష్కరణ, శక్తి, సృజనాత్మకత అన్నీ ఒకే వేదికపై కనబడుతున్నాయి. ‘ఓజీ’ సినిమాలో ఉపయోగించిన కారు వంటి ప్రఖ్యాత ఫిల్మ్ కార్లు ఆటోమొబైల్ పరిశ్రమ సినిమాల్లో ఎంత కీలక పాత్ర పోషిస్తుందో చూపిస్తున్నాయి” అన్నారు.

ప్రదర్శనలో 1951 మోరిస్ ఆక్స్‌ఫర్డ్, 1945 బ్యూయిక్, 1946 డిసోటో, అలాగే ‘కాంతా’ సినిమాలో కనిపించిన విన్టేజ్ కార్లు, ఇండియాలోనే వేగవంతమైన కారు ఆడి R8, మరియు ‘ఓజీ’ సినిమాలో ఉపయోగించిన 1955 డాడ్జ్ కింగ్స్‌వే కార్లను ప్రత్యేక ఆకర్షణగా ఉంచారు.

అదనంగా, విద్యార్థులు మరియు ఆసక్తిగల వారికి సూపర్ కార్లు, వర్క్‌షాపులు, ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించడంతో ఆటోమొబైల్ డిజైన్, ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగాల్లో కెరీర్ అవకాశాలను పరిచయం చేశారు.

ది ఆటో ఎక్స్‌పో 2025 ద్వారా వివిధ కాలేజీల విద్యార్థులు, సృష్టికర్తలు, ఆటోమొబైల్ ప్రియులు ఒకే వేదికపై కలుసుకొని, నేర్చుకొని, తమ భవిష్యత్ కెరీర్ దిశగా ప్రేరణ పొందే అద్భుతమైన వేదికగా నిలిచింది. యువతకు ఆసక్తిని ప్రొఫెషనల్ అవగాహనతో కలిపే ప్రత్యేక అవకాశం అందించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories