Citroen Car: కారు కొనేవారికి బంపర్‌ ఆఫర్.. ఏకంగా రూ.1.75 లక్షల తగ్గింపు..

Citroen Car
x

Citroen Car: కారు కొనేవారికి బంపర్‌ ఆఫర్.. ఏకంగా రూ.1.75 లక్షల తగ్గింపు..

Highlights

Citroen Extends Discount: కారు కొనాలనుకునేవారు ఇప్పుడే కొనేయండి. ఎందుకంటే ఒక వైపు దిగ్గజ కారు కంపెనీలైన హ్యుండాయ్‌, మహీంద్రా, రినాల్ట్‌ ధరలను పెంచితే మరోవైపు సిట్రోయెన్‌ మాత్రం కస్టమర్లకు భారీ డిస్కౌంట్‌ ప్రకటిస్తోంది. ఏకంగా లక్షన్నరకు పైగా డిస్కౌంట్‌ ప్రకటిస్తోంది.

Citroen Extends Discount: సిట్రోయెన్‌ బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. చెక్‌ దేశానికి చెందిన ఈ కార్ల మాన్యుఫ్యాక్చరర్‌ తమ కారు బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తోంది. MY2023, eC3, C3, MY2024 మోడల్లపై బాసల్ట్‌ కారుపై భారీ తగ్గుదలతో కార్లను విక్రయిస్తోంది. ఏ బ్రాండ్‌పై ఎంత డిస్కౌంట్‌ ప్రకటించారు తెలుసుకుందాం...

సిట్రోయెన్‌ C3..

మార్చి ఆఫర్‌లో భాగంగా ఈ కారుపై ఏకంగా రూ. 1 లక్ష డిస్కౌంట్‌ MY2023 C3పై ప్రకటించింది. మన భారతీయ మార్కెట్‌లో ఈ కారుకు రెండు ఇంజిన్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి. 1.2 లీటర్‌ NA పెట్రోల్‌, 1.2 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ ఉన్నాయి. పీక్‌ పవర్‌ అవుట్‌ పుట్‌ 82 హెచ్‌పీ, 110 హెచ్‌పీ ఈ రెండు ఆప్షన్స్‌ ఉన్న కార్లు ఇస్తున్నాయి.

సిట్రయెన్‌ C3 ఎయిర్‌క్రాస్‌..

ఈ మోడల్‌ కారుపై ఏకంగా రూ.1.75 లక్షల భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఇది కేవలం ఎయిర్‌ క్రాస్‌ ఎస్‌యూవీకి మాత్రమే. ఇందులో 1.2l జెన్‌ III ప్యూర్‌టెక్‌ టర్బో ఇంజిన్‌ కలిగి ఉంటుంది. దీని పీక్‌ పవర్‌ అవుట్‌పుట్‌ 110 హెచ్‌పీ కాగా, టార్క్యూ అవుట్‌పుట్‌ 205N ఉంటుంది.

సిట్రోయెన్‌ బాసల్ట్‌..

ఈ కారుపై ఏకంగా రూ.1.70 లక్షల భారీ డిస్కౌంట్‌ ప్రకటించాయి. ఈ తగ్గుదల MY2024 బాసల్ట్‌ మోడల్‌కు వర్తిస్తుంది. ఈ మోడల్‌లో మొత్తంగా మూడు ఇంజిన్ ఆప్షన్స్‌ ఉన్నాయి. 1.2లీటర్‌ NA పెట్రోల్‌ ఇంజిన్‌, 82 హెచ్‌పీ, 115 Nm టార్క్యూ, 1.2 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ దీని పీక్‌ పవర్‌ 110 హెచ్‌పీ ఉంది. టర్క్యూ అవుట్‌పుట 190 Nm ఇస్తుంది.

సిట్రోయెన్‌ eC3..

సిట్రోయెన్‌ eC3 పై ఏకంగా రూ.80,000 భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. మార్చి ఆఫర్స్‌లో భాగంగా ఈ భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఇది సిట్రోయెన్‌ కంపెనీకి చెందిన ఏకైక ఎలక్ట్రిక్‌ కారు. అన్ని ఎలక్ట్రిక్‌ హ్యాట్చ్‌ బ్యాక్‌ 29.2kWh బ్యాటరీ ప్యాక్‌, పీక్‌ పవర్‌ 57 హెచ్‌పీ, టార్క్యూ 143Nm అవుట్‌ పుట్‌ ఇస్తుంది. దీని ARAI రేంజ్‌ 320 కీమీ ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories