BYD Sealion 7: 'లయన్'ను దింపిన సీలియన్.. ఫిబ్రవరి 17న లాంచ్..!

Chinese Carmaker BYD is Set to Launch the Sealion 7 in the Indian Market
x

BYD Sealion 7: 'లయన్'ను దింపిన సీలియన్.. ఫిబ్రవరి 17న లాంచ్..!

Highlights

BYD Sealion 7: భారత్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరగడంతో విదేశీ ఈవీ బ్రాండ్లు ఈ విభాగంలోకి ప్రవేశిస్తున్నాయి.

BYD Sealion 7: భారత్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరగడంతో విదేశీ ఈవీ బ్రాండ్లు ఈ విభాగంలోకి ప్రవేశిస్తున్నాయి. మీరు కూడా రాబోయే రోజుల్లో లగ్జరీ ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తుంటే మీకో శుభవార్త ఉంది. చైనీస్ కార్ల తయారీ కంపెనీ బీవైడీ త్వరలో దేశీయ మార్కెట్లో Sealion 7ని విడుదల చేయబోతోంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ కారు ఫిబ్రవరి 17న విడుదల కానుంది. కారు బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తిగా ఉన్న వినియోగదారులు రూ.70 వేలు టోకెన్ మొత్తాన్ని చెల్లించి ఈవీని బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కారు రేంజ్, ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను చూద్దాం.

కొత్త సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే రెండు వేరియంట్లలో వస్తుంది. ఈ ఈవీలో 82.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఈ బ్యాటరీ 567 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

ఈ పవర్‌ట్రెయిన్ 308బిహెచ్‌పి పవర్, 380ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో రేర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ డ్రైవ్‌ట్రెయిన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో పనోరమిక్ గ్లాస్ రూఫ్,15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సేఫ్టీ కోసం అడాస్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 11 ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

బీవైడీ సీలియన్ 7 దేశంలో కంపెనీకి చెందిన నాల్గవ ఎలక్ట్రిక్ కారు అవుతుంది. సీల్ ఈవీ వలె, ఫ్రంట్ ఫేసియాలో హెడ్‌లైట్ యూనిట్, బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్, ఆకర్షణీయమైన బంపర్‌లు ఉన్నాయి. సీలియన్ 7 ఇంటెలిజెంట్ టార్క్ యాక్టివ్ కంట్రోల్, ఇన్నోవేటివ్ సెల్ టు బాడీ ఆర్కిటెక్చర్ వంటి అనేక అధునాతన సాంకేతికతో వస్తుంది.

ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 19-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ రగ్డ్ క్లాడింగ్ టాపర్డ్ రూఫ్‌లైన్‌తో వస్తుంది. ఈ కారును దాదాపు రూ. 40-45 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో భారత్ మార్కెట్లో విడుదల చేయచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories