Maruti Suzuki Brezza: కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.. అయితే రూ.16 వేలకే ఇంటికి తీసుకెళ్లండి..!

Maruti Suzuki Brezza
x

Maruti Suzuki Brezza: కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.. అయితే రూ.16 వేలకే ఇంటికి తీసుకెళ్లండి..!

Highlights

Maruti Suzuki Brezza: మారుతి సుజుకి బ్రెజ్జా ఇండియాలో ఫేమస్ ఎస్‌యూవీ. ఫిబ్రవరి 1 నుంచి ఈ కారు ధర రూ.20,000 వరకు పెరిగింది. కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.8.54 లక్షల నుండి రూ.14.14 లక్షల వరకు ఉంటుంది.

Maruti Suzuki Brezza

మారుతి సుజుకి బ్రెజ్జా ఇండియాలో ఫేమస్ ఎస్‌యూవీ. ఫిబ్రవరి 1 నుంచి ఈ కారు ధర రూ.20,000 వరకు పెరిగింది. కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.8.54 లక్షల నుండి రూ.14.14 లక్షల వరకు ఉంటుంది. ఈ ఎస్‌యూవీ ఆన్-రోడ్ ప్రైస్, ఈఎమ్ఐ తదితర వివరాలు తెలుసుకుందాం.

మారుతి సుజుకి బ్రెజ్జా వివిధ రకాల వేరియంట్లలో అందుబాటులో ఉంది. బ్రెజ్జా LXI (పెట్రోల్) వేరియంట్ ధర రూ.10 లక్షల వరకు ఆన్-రోడ్. మీరు సుమారు రూ.2 లక్షల డౌన్‌పేమెంట్‌తో కొనుగోలు చేస్తే, రూ.8 లక్షల వరకు లోన్ ఉంటుంది. 8శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాల పాటు నెలకు రూ.16,000 వరకు EMI చెల్లించాలి.

మారుతి బ్రెజ్జా ఎస్‌యూవీ VXI (పెట్రోల్) వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ. 11.60 లక్షలు. మీరు రూ.2 లక్షల డౌన్‌పేమెంట్‌తో కొనుగోలు చేస్తే, లోన్ మొత్తం రూ.9.60 లక్షల వరకు ఉంటుంది. దానిపై 8శాతం వడ్డీని జోడించి, 5 సంవత్సరాల పాటు నెలకు రూ.19,500 వరకు EMI చెల్లించాలి.

బ్రెజ్జా యొక్క ZXI ప్లస్ (పెట్రోల్) వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ. 15.60 లక్షల వరకు ఉంది. రూ.2 లక్షల డౌన్‌పేమెంట్‌తో తీసుకుంటే, రుణం మొత్తం రూ.13.60 లక్షల వరకు ఉంటుంది. 8% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల పాటు నెలకు రూ.27,500 వరకు EMI చెల్లించాలి.

మారుతి సుజుకి బ్రెజ్జా ఎస్‌యూవీ LXI (CNG) వేరియంట్ ధర రూ.11 లక్షల వరకు ఉంది. మీరు రూ.2 లక్షల డౌన్‌పేమెంట్‌తో ఈ కారును ఇంటికి తీసుకువస్తే, లోన్ మొత్తం రూ.9 లక్షల వరకు ఉంటుంది. 8శాతం వడ్డీతో 5 సంవత్సరాల పాటు నెలకు 18,000 EMI చెల్లించాలి.

మారుతి బ్రెజ్జా ఎస్‌యూవీ సిజ్లింగ్ రెడ్, బ్రేవ్ ఖాకీ, పెర్ల్, మాగ్మా గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ వంటి వివిధ ఆకర్షణీయమైన రంగులలో కూడా అందుబాటులో ఉంది. కారులో 5-సీట్లు ఉంటాయి. 328 లీటర్ల సామర్థ్యం గల బూట్ స్పేస్‌ ఉంది.

ఈ కారు 1.5-లీటర్ పెట్రోల్, సిఎన్‌జి ఇంజన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. బ్రెజ్జా 17.38 నుండి 25.51 kmpl మైలేజీని ఇస్తుంది.

మారుతి బ్రెజ్జా ఎస్‌యూవీలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 4-స్పీకర్ సౌండ్ సిస్టమ్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి డజన్ల కొద్దీ ఫీచర్లతో వస్తుంది. ఈ కారు గరిష్ట రక్షణను అందిస్తుంది. భద్రత కోసం 6-ఎయిర్‌బ్యాగ్స్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా ఫీచర్లు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories