Bumper Discount Cars: ఇదే లాస్ట్‌ ఛాన్స్‌.. ఈ నెలలోనే కొనండి, ఈ కారుపై ఏకంగా రూ.65,000 తగ్గింపు

Bumper Discount Cars
x

Bumper Discount Cars: ఇదే లాస్ట్‌ ఛాన్స్‌.. ఈ నెలలోనే కొనండి, ఈ కారుపై ఏకంగా రూ.65,000 తగ్గింపు

Highlights

Bumper Discount Cars: కారు కొనాలనుకునేవారికి బంపర్‌ ఆఫర్‌ ఈ కార్లపై ఏకంగా రూ.65,000 తగ్గింపు. అద్భుతమైన ఈ కార్లపై కళ్లు చెదిరే లాభాలు తెలుసా?

Bumper Discount Cars: కస్టమర్లను ఆకట్టుకునే పనిలో పడింది మారుతీ కంపెనీ తయారుదారు. ఈ నేపథ్యంలో వారికి కళ్లు చెదిరే బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ట్రంప్‌ ట్యాక్స్‌ల మోతా ఆటో ఇండస్ట్రీపై కూడా పడనుంది. దీంతో కార్ల ధరలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. కానీ, మారుతీ కంపెనీ మాత్రం తమ కార్లను ఏకంగా రూ.65,000 తగ్గింపు ప్రకటించింది. 2025 ఏప్రిల్‌నెలలో మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఆ కార్లు ఏంటో తెలుసుకుందాం..

మారుతీ వేగనార్‌..

ఈ కారు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. వేగనార్‌ కారుఉ ధర తక్కువలో ఉంటుంది. దీని ఫీచర్స్‌ అదుర్స్‌. ఇందులో రకరకాల మోడల్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ కారుపై ఏకంగా రూ.65,000 తగ్గింపుతో విక్రయిస్తుంది. ఏఎంటీ వెర్షన్‌పై ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇందులో 1 లీటర్‌, 1.2 లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌కు వర్తిస్తుంది. సీఎన్‌జీ రూ.60 వేల తగ్గింపుతో అందిస్తోంది.

మారుతీ సిలేరియో..

మారుతీ సిలేరియో కొత్తగా తక్కువ బడ్జెట్‌లో కారు కొనాలంటే ఎక్కువ మంది కస్టమర్లు ఈ కారుపై ఆసక్తి చూపుతారు ఇందులో ఏఎంటీ వెరియెంట్‌పై రూ.65,000 డిస్కౌంట్‌ ప్రకటించింది. పెట్రోల్‌, మ్యానువల్‌కు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. అయితే సీఎన్‌జీ వేరియంట్‌ అయితే రూ.60,000 డిస్కౌంట్‌ లభిస్తుంది.

మారుతీ స్విఫ్ట్‌..

స్విఫ్ట్‌ ఏఎంటీ వెర్షన్‌ రూ.50,000 ఆఫర్ ఉంది. సీఎన్‌జీ అయితే, ఏకంగా రూ.45,000 తగ్గింపు ఉంది. ఇది 1.2 లీటర్‌ Z సిరీస్ పెట్రోల్‌ వాహనంపై ఆఫర్ ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories