MG ZS EV: టాటా, మహీంద్రాకు భారీ షాక్.. రూ.4.44లక్షల తగ్గింపుతో ఎంజీ కారు

MG ZS EV
x

MG ZS EV: టాటా, మహీంద్రాకు భారీ షాక్.. రూ.4.44లక్షల తగ్గింపుతో ఎంజీ కారు

Highlights

MG ZS EV: భారత మార్కెట్‌లో ఎంజీ మోటార్ ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వినియోగదారులకు అదిరిపోయే బహుమతి ఇచ్చింది. కంపెనీ తన పాపులర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ MG ZS EV అన్ని వేరియంట్ల ధరలను భారీగా తగ్గించింది.

MG ZS EV: భారత మార్కెట్‌లో ఎంజీ మోటార్ ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వినియోగదారులకు అదిరిపోయే బహుమతి ఇచ్చింది. కంపెనీ తన పాపులర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ MG ZS EV అన్ని వేరియంట్ల ధరలను భారీగా తగ్గించింది. 2025 మోడల్ MG ZS EV ఇప్పుడు ఏకంగా రూ.4.44 లక్షల తక్కువకు వస్తుంది. దీని కొత్త ప్రారంభ ధర రూ.16.75 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలై రూ.20.50 లక్షల వరకు ఉంటుంది.

ఈ కొత్త ధరతో MG ZS EV ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న తన పోటీదారులైన టాటా కర్వ్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా BE 6 వంటి కార్లతో పాటు తన ఎంజీ విండ్సర్ ప్రో కంటే కూడా ధరలో చాలా తక్కువగా ఉంది. ఇది మార్కెట్‌లో ఎంజీకి ఒక గట్టి పోటీని ఇస్తుంది. MG ZS EV ఒక స్టైలిష్, టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఇప్పుడు ధర తగ్గడంతో ఇది గతంలో కంటే చాలా బెస్ట్ ఆప్షన్ గా మారింది. ఈ కారులో 50.3 kWh కెపాసిటీ గల బ్యాటరీ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 461 కి.మీ. డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 174 bhp పవర్, 280 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్మూత్ డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. నగరంలో, హైవేలపై కూడా మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.

దేశంలో MG ZS EV కంపెనీ రెండవ ఎలక్ట్రిక్ కారు. గత 6 నెలల్లో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సగటున నెలకు 600 యూనిట్ల వరకు అమ్ముడైంది. అయితే, ఎంజీ మరొక ఎలక్ట్రిక్ కారు విండ్సర్ ఈవీ, ఇతర కంపెనీల ఈవీ అమ్మకాలను ప్రభావితం చేయడమే కాకుండా, ZS EV అమ్మకాల క్షీణతకు కూడా కారణమైంది. విండ్సర్ ఈవీ నెలకు సగటున 3,450 యూనిట్లు అమ్ముడవుతోంది. సెప్టెంబర్ 2024 నుంచి ఇప్పటి వరకు 27,000 యూనిట్లకు పైగా విక్రయించబడ్డాయి.

MG ZS EV ధరలో ఈ తగ్గింపు ద్వారా ZS EV అమ్మకాలను పెంచాలని, ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో తన పట్టును తిరిగి పటిష్టం చేసుకోవాలని ఎంజీ ఆశిస్తోంది. మార్కెట్‌లో పోటీని తట్టుకోవడానికి, ఎక్కువ మంది కస్టమర్‌లను ఆకర్షించడానికి మంచి ప్రయత్నం.

MG ZS EV లో లెవెల్-2 ADAS, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా వంటి లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. దీంతో పాటు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్‌ప్లే, 10.1 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, PM 2.5 ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ప్రీమియం సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories