Best Hybrid Cars In India: అదిరిపోయే హైబ్రిడ్ మైలేజ్ కార్లు.. బెస్ట్-3 ఇవే

best strong hybrid cars with best features and mileage
x

Best Hybrid Cars In India: అదిరిపోయే హైబ్రిడ్ మైలేజ్ కార్లు.. బెస్ట్-3 ఇవే

Highlights

Best Hybrid Cars In India: భారత్ ఆటోమొబైల్ మార్కెట్లో సిఎన్‌జి తర్వాత, హైబ్రిడ్ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. రోజులు గడిచే కొద్ది వీటి వినియోగం...

Best Hybrid Cars In India: భారత్ ఆటోమొబైల్ మార్కెట్లో సిఎన్‌జి తర్వాత, హైబ్రిడ్ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. రోజులు గడిచే కొద్ది వీటి వినియోగం కూడా ఎక్కువవుతోంది. ఈ డిమాండ్‌నే దృష్టిలో ఉంచుకొని అనేక కంపెనీలు సరికొత్త కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి.

అయితే మీరు ఈ సెగ్మెంట్లో ఏ కారు కొనాలనే కన్ఫ్యూజన్‌లో ఉంటే.. ఫీచర్లు, మైలేజ్ పరంగా మూడు 3 అత్యుత్తమ స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్ల జాబితాను మీ కోసం రెడీ చేశాం. ఇందులో మారుతి గ్రాండ్ విటారా నుండి హోండా సిటీ హైబ్రిడ్ వరకు మూడు కార్లు ఉన్నాయి. రండి.. ఆ హై బ్రిడ్ కార్లు ఏంటి.. వాటి ఫీచర్స్ ఏంటనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మారుతి సుజుకి గ్రాండ్ వితారా

మారుతి సుజుకి గ్రాండ్ విటారా Zeta+ వేరియంట్‌లో స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌ ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 18.43 లక్షలుగా ఉంది. కారులో 116 పిఎస్ హార్స్ పవర్ రిలీజ్ చేసే 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ ఉంది. ఇక ఈ కారు మైలేజ్ విషయానికొస్తే.. ఈ SUV కారు లీటర్ ఫ్యూయెల్‌కు 28 కిమీ మైలేజీని ఇస్తుంది.

ఈ కారులో 373 లీటర్ల బూట్ స్పేస్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్స్ ఉన్నాయి. అలాగే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, హెడ్-అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆటోతో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ కూడా ఉన్నాయి. ఇక సేఫ్టీ విషయానికొస్తే... ఈ కారులో 6-ఎయిర్‌బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా ఫీచర్స్ ఉన్నాయి.

టొయోట ఇన్నోవా హైరైడర్

జాబితాలో రెండవది ఇన్నోవా హైరైడర్. కారులో గ్రాండ్ విటారాలో ఉండే ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ e-CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌, 1.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌తో వస్తుంది. ఇన్నోవా హైరైడర్ S e Drive 2WD హైబ్రిడ్ వేరియంట్‌ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 16.66 లక్షలుగా ఉంది. ఈ హైబ్రిడ్ కార్ లీటర్ ఇంధనానికి 28 కిమీ మైలేజ్ ఇస్తుంది.

హోండా సిటీ హైబ్రిడ్

హోండా సిటీ కారు హైబ్రిడ్ కార్లలో ఒక బెస్ట్ ఆప్షన్. కంపెనీ ఈ కారును 1.5-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో అందిస్తోంది. ఇంజన్ e-CVTతో 126 పిఎస్ పవర్, 253 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు లీటర్ ఫ్యూయెల్‌కు 27.13 కిమీ మైలేజీని ఇస్తుంది. మీరు ఈ హైబ్రిడ్ కారును రూ. 19 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరకు సొంతం చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories