Best Scooter: జనాలు మెచ్చిన బెస్ట్ స్కూటర్ ఇదే.. గత నెలలో లక్ష యూనిట్లు అమ్ముడయ్యాయి..!

Best Scooter
x

Best Scooter: జనాలు మెచ్చిన బెస్ట్ స్కూటర్ ఇదే.. గత నెలలో లక్ష యూనిట్లు అమ్ముడయ్యాయి..!

Highlights

Best Scooter: టీవీఎస్ జూపిటర్ ఈసారి బాగా అమ్ముడైంది, హోండా యాక్టివాకు చాలా గట్టి పోటీ ఇచ్చింది.

Best Scooter: హోండా యాక్టివా ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్. ఈ స్కూటర్ ప్రతి నెలా భారీగా అమ్ముడవుతోంది. అయితే టీవీఎస్ జూపిటర్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి యాక్టివా సేల్స్ తగ్గుతూ వస్తున్నాయి. చాలా కాలంగా ఈ స్కూటర్‌లో హోండా ఎటువంటి మార్పులు చేయలేదు. జూపిటర్ ఇప్పుడు కొత్త అవతార్‌లో వచ్చింది. అప్పటి నుంచి ఈ స్కూటర్ సేల్స్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. గత నెలలో ఈ స్కూటర్ విక్రయాలు లక్ష దాటాయి. ఇప్పుడు ఈ రెండు స్కూటర్ల విక్రయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

గత నెలలో హోండా యాక్టివా 1,66,739 యూనిట్లను విక్రయించగా, గతేడాది ఇదే సమయానికి కంపెనీ 1,45,252 యూనిట్ల యాక్టివా స్కూటర్లను విక్రయించింది. ఈసారి ఈ స్కూటర్ 7,021 యూనిట్లను తక్కువగా విక్రయించింది. అయినప్పటికీ ఈ స్కూటర్ దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్‌గా నిలిచింది.

టీవీఎస్ జూపిటర్ ఈసారి బాగా అమ్ముడైంది, హోండా యాక్టివాకు చాలా గట్టి పోటీ ఇచ్చింది. గత నెలలో జూపిటర్ 1,07,847 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది జుపిటర్ 74,225 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈసారి కంపెనీ ఈ స్కూటర్‌ను మరో 33,622 యూనిట్లను విక్రయించింది. అంతే కాకుండా ఈ స్కూటర్ YOY వృద్ధి 45.30శాతం పెరిగింది.

ఈసారి టీవీఎస్ జూపిటర్‌లో చాలా పెద్ద మార్పులు చేసింది. ఈ స్కూటర్ ఇప్పుడు మునుపటి కంటే మెరుగ్గా కనిపిస్తుంది. కొత్త జూపిటర్ డిజైన్, ఫీచర్లు, ఇంజన్ పరంగా అధునాతనంగా మారింది, అయితే యాక్టివా స్కూటర్‌లో కొత్తగా మార్పులేమి చేయలేదు. మారుతున్న నేటి కాలంలో ప్రజలు నిత్యం కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి

జూపిటర్ సేల్స్ పరంగా యాక్టివాకు పోటీగా నిలుస్తుంది.

జూపిటర్ 110 స్కూటర్‌లో 113.3సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ఇంజన్ 5.9 బిహెచ్‌పి పవర్, 9.8 ఎన్ఎమ్ టార్క్‌ రిలీజ్ చేస్తుంది. ఇందులో సివిటి గేర్‌బాక్స్ ఉంది. స్కూటర్ గరిష్ట వేగం గంటకు 82 కిమీ.

Show Full Article
Print Article
Next Story
More Stories